Naveen Chandra: నవీన్ చంద్ర కీలక పాత్రలో నటించిన తాజా క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ ‘లెవన్’. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ సినిమాతో లోకేశ్ అజ్లిస్ అనే యువ దర్శకుడు పరిచయం కాబోతున్నారు. రేయా హరి, శశాంక్, అభిరామి, దిలీపన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వరుస హత్యలు చేస్తున్న హంతకుడ్ని పట్టుకునే పోలీసు ఆఫీసర్ పాత్రలో నవీన్ చంద్ర కనిపించబోతున్నారు. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్న ఈ ‘లెవన్’ సినిమాకు సంబంధించిన టీజర్ ను హీరో నిఖిల్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
Naveen Chandra Movie Updates
ఇక టీజర్ విషయానికి వస్తే… ‘రంజిత్‌లాంటి ప్రతిభ కలిగిన ఆఫీసర్ ఈ కేసును ఎందుకు ఛేదించలేకపోయాడో అర్థం కాలేదు. ఫింగర్ ప్రింట్స్ లేవు.. ఫుట్ ప్రింట్స్ లేవు.. కనీసం జుట్టు ఆనవాళ్లు కూడా లేవు’ అంటూ ఆసక్తికరంగా మొదలైన టీజర్… ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. మరి హత్య కేసును పోలీస్ ఆఫీసర్ అయిన నవీన్ చంద్ర ఎలా ఛేదించాడో తెలియాలంటే సినిమా చూడాల్సిందే !
Also Read : Saindhav : హిందీలో వెంకటేష్ ‘సైంధవ్’ ! స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?