Natural Star Nani: నేచురల్ స్టార్ నాని… అవుట్ అండ్ అవుట్ మాస్ లుక్ తో యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ సినిమా ‘దసరా’. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాలో నాని, కీర్తి సురేష్, సముద్రఖని, కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించారు. గతేడాది మార్చి 30న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచి వంద కోట్లకు పైగా వసూళ్ళను సాధించింది. దీనితో ఈ బ్లాక్ బస్టర్ మూవీ విడుదలై ఏడాది కావడంతో… నాని అభిమానులకు ఈ చిత్ర యూనిట్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ హిట్ కాంబినేషన్ ను రిపీట్ చేస్తూ నానితో కొత్త సినిమాను చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు ‘నాని 33’ (వర్కింగ్ టైటిల్) తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీలుక్ ను తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. దీనితో ‘నాని 33’ కు సంబంధించిన ప్రీ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
Natural Star Nani
చిత్ర యూనిట్ విడుదల చేసిన ప్రీలుక్ లో… ఎరుపు రంగుతో నిండి ఉన్న ఆ ప్రచార చిత్రంలో నాని(Natural Star Nani) గడ్డం, మెలితిప్పిన మీసాలతో మాస్ లుక్ లో కనిపించారు. ‘‘నాయకుడిగా ఉండటానికి గుర్తింపు అవసరం లేదు’’ అంటూ ఆ పోస్టర్ పై ఓ ఆసక్తికర వ్యాఖ్యను జోడించారు. ‘‘విప్లవం ప్రారంభమయ్యే ముందు హింస దాని సరైన రూపాన్ని తీసుకుంటుంది’’ అంటూ చిత్ర నిర్మాణ సంస్థ కూడా తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. దీనిని బట్టి శ్రీకాంత్ ఈ సారి నాని కోసం మరో భారీ మాస్ యాక్షన్ కథాంశాన్ని సిద్ధం చేసినట్లు అర్థమవుతోంది. ‘నాని 33’ వర్కింగ్ టైటిల్‌తో పట్టాలెక్కనున్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. నాని ప్రస్తుతం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ‘సరిపోదా శనివారం’ సినిమాలో నటిస్తున్నారు. దీని తరువాత బలగం ఫేం వేణు దర్శకత్వంలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
Also Read : Vijay Sethupathi: క్రేజీ మూవీ ఫ్రాంచైజీ నుండి తప్పుకున్న విజయ్ సేతుపతి !