Natural Star Nani: నాని ‘హాయ్‌ నాన్న’కు ‘బిహైండ్‌వుడ్స్’ అవార్డ్ !

నాని ‘హాయ్‌ నాన్న’కు 'బిహైండ్‌వుడ్స్' అవార్డ్ !

నాని ‘హాయ్‌ నాన్న’కు ‘బిహైండ్‌వుడ్స్’ అవార్డ్ !

 

వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై యువ దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన తాజా సినిమా ‘హాయ్‌ నాన్న’. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గతేడాది డిసెంబరులో విడుదలైన ఈ సినిమా… పాజిటివ్ టాక్ ను సంపాదించి… బాక్సాఫీసు దగ్గర మంచి వసూళ్ళను రాబట్టింది. థియేటర్లలో వసూళ్ళ వరద పారించిన ‘హాయ్‌ నాన్న’… ఇప్పుడు అవార్డుల వేటలో పడింది. ఇటీవల నిర్వహించిన ప్రతిష్టాత్మకమైన బిహైండ్‌వుడ్స్ గోల్డ్ హాల్ ఆఫ్ ఫేమర్స్ లో ‘హాయ్‌ నాన్న’ మూడు కేటగిరీల్లో అవార్డులను సొంతం చేసుకుంది. పాన్ ఇండియా స్టార్స్ పాల్గొన్న ఈ ఈవెంట్ లో హీరో నాని, హీరోయిన్ మృణాల్ ఠాకూర్, దర్శకుడు శౌర్యువ్…. యానిమల్ దర్శకుడు సందీప్ వంగా చేతుల మీదుగా ఈ అవార్డులను అందుకున్నారు. ప్రస్తుతం ‘బిహైండ్‌వుడ్స్’ అవార్డ్ అందుకుంటున్న ఫోటోలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.

 

‘హాయ్‌ నాన్న’లో తన పాత్రకు ప్రశంసలు అందుకున్న నాని… ది బిహైండ్‌వుడ్స్ గోల్డ్ హాల్ ఆఫ్ ఫేమ్ యాక్టర్ ఇన్ ఎ లీడ్ రోల్ 2023 అవార్డును అందుకున్నాడు. హాయ్ నాన్నాలో తన అద్భుతమైన నటనకు గాను మృణాల్ ఠాకూర్… బిహైండ్‌వుడ్స్ గోల్డ్ హాల్ ఆఫ్ ఫేమ్ యాక్టర్సెస్ ఇన్ ఎ లీడ్ రోల్ అవార్డును అందుకోగా… దర్శకుడు శౌర్య 2023 బిహైండ్‌వుడ్స్ గోల్డ్ హాల్ ఆఫ్ ఫేమ్ ఫిల్మ్‌మేకర్‌ అవార్డును కైవసం చేసుకున్నారు. యానిమల్ దర్శకుడు సందీప్ వంగా చేతుల మీదుగా ఈ అవార్డులను అందుకున్నారు. ఇదిలాఉండ‌గా అదే వేదిక‌పై బెస్ట్ డైరెక్ట‌ర్ ఆవార్డు యానిమ‌ల్ సినిమాకు గాను ఎంపికకాగా… నేచుర‌ల్ స్టార్ నాని చేతుల మీదుగా ఈ అవార్డును సందీప్ రెడ్డి వంగాకు అందుకున్నారు.

 

hi nannaMrunal ThakurNatural Star Nani
Comments (0)
Add Comment