Natural Star Nani: ఎన్నికల ప్రచారంలో నాని !

రాజకీయ నాయకుని అవతారం ఎత్తిన నాని

ఎన్నికల ప్రచారంలో నాని !

Natural Star Nani : కేంద్ర ఎన్నికల కమీషన్ ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు ప్రకటించడంతో దేశంలో ప్రస్తుతం ఎలక్షన్ సీజన్ నడుస్తోంది. దీనితో ‘కాదేదీ ప్రచారానికి అనర్హం’ అన్నట్లు ఓట్ల కోసం రాజకీయ నాయకులు వేయని వేషం లేదు. ఓటర్లకు గాలం వేయడానికి బజ్జీలు వేయడం నుండి కుమ్మరి, కమ్మరి, వండ్రంగి ఇలా ఎక్కడ ఏ వృత్తి వారిని కలిస్తే వారి అవతారం ఎత్తి ఫోటోలకు ఫోజులిస్తారు. దీనితో ఎన్నికల వేళ ఓట్ల కోసం రాజకీయ నాయకులు వేసే వేషాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అయితే ఈ సారి ఎన్నికల్లో మాత్రం ఫర్ ఏ ఛేంజ్…. అంటూ నేచురల్ స్టార్ నాని తన సినిమా ప్రమోషన్ కోసం రాజకీయ నాయకుడి అవతారం ఎత్తారు. ప్రస్తుతం రాజకీయ నాయకుని అవతారంలో ఓట్లు అడుతున్న ఆయన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Natural Star Nani – రాజకీయ నాయకుని అవతారంలో నాని ‘హాయ్‌ నాన్న’ సినిమా ప్రమోషన్

‘కాదేదీ ప్రచారానికి అనర్హం’ అన్న రాజకీయ నాయకుల సూత్రాన్ని సినిమాకు ఆపాదించాడు నేచురల్ స్టార్ నాని. డిసెంబరు 7న విడుదల కాబోతున్న తన ‘హాయ్‌ నాన్న’ ప్రమోషన్ కోసం ఏకంగా రాజకీయ నాయకుడి అవతారం ఎత్తారు. ఫక్తు పొలిటికల్‌ లీడర్‌ గెటప్ లోనికి మారిపోయిన నాని(Natural Star Nani)… ఖద్దరు చొక్కా, కండువాతో ‘మీ ప్రేమ మరియు ఓటు మాకే అవ్వాలని’ అంటూ ఓ ఫొటో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ పిక్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దేశంలో ఎన్నికల సీజన్ నడుస్తోందని, అందుకే ఈ గెటప్‌ వేశానని నాని కామెంట్‌ పోస్ట్‌ చేశాడు.

డిసెంబరు 7 వస్తున్న ‘హాయ్‌ నాన్న’

వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై మోహన్ చెరుకూరి, విజయేంద్రరెడ్డి తీగల, మూర్తి కె ఎస్ నిర్మాతలుగా నేచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘హాయ్‌ నాన్న’. యువదర్శకుడు శౌర్యువ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు హేసమ్ అబ్ధుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నారు. డిసెంబరు 7 ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేస్తున్న ఈ చిత్రానికి నాని, మృణాల్ ఠాకూర్ చేస్తున్న ప్రచారానికి దేశవ్యాప్తంగా విశేష స్పందన వస్తుంది. ఈ చిత్రంలో విరాజ్‌ అనే పాత్రలో కనిపించనున్నాడు నాని.

Also Read: Akkineni Naga Chitanya: యూట్యూబ్ ఛానెల్ ను ప్రారంభించిన నాగ చైతన్య

hi nannaMrunal ThakurNatural Star Nani
Comments (0)
Add Comment