Natasha Doshi : ముహుర్తాలు గట్టిగా ఉండడంవల్లో ఏమో… సెలబ్రిటీలు కూడా మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెడుతున్నారు. అయితే 3 నెలల క్రితమే పెళ్లి చేసుకుంటానని అందరూ చెబితే… టాలీవుడ్ హీరోయిన్ నటాషా దోషి ఎవరికీ చెప్పకుండా.. మీడియాకి కూడా తెలియకుండా పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఆమె ఫోటోను స్ప్రెడ్ చేసి వైరల్ చేస్తూ అందరికి షాక్ ఇచ్చింది.
Natasha Doshi Marriage Updates
ముంబైకి చెందిన నటాషా దోషి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. బాలకృష్ణ ‘జై సింహా’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత శ్రీకాంత్ హీరోగా తెరకెక్కిన కోతల రాయుడు సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత కళ్యాణ్ రామ్ నటించిన ఎంత మంచి వాడవురా సినిమాలో ఓ స్పెషల్ సాంగ్లో చేసింది. అయితే వీటిలో ఏ సినిమా కూడా పాజిటివ్ రివ్యూలను అందుకోలేదు.
Also Read : Manjummel Boys : ప్రపంచవ్యాప్తంగా 100కోట్లు కలెక్ట్ చేసిన ‘మంజుమ్మేల్ బాయ్స్’