Natasha Doshi: నందమూరి నట సింహాం బాలకృష్ణ నటించిన ‘జై సింహా’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన నటాసా దోషి(Natasha Doshi)… పెళ్లి పీటలెక్కింది. ప్రముఖ వ్యాపార వేత్త మనన్ షాను పెళ్లి చేసుకుంది. జనవరి 31 తన ప్రేమికుడిని మనువాడిన ఈ మరాఠీ ముద్దుగుమ్మ… ఈ విషయాన్ని మూడు రోజుల తరువాత అంటే ఆదివారం ప్రకటించింది. సోషల్ మీడియా ఇన్ స్టా వేదికగా తమ పెళ్ళి ఫోటోలు పోస్ట్ చేసి… తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది. ‘నువ్వు పరిచయమైన క్షణం ఈ ప్రపంచమంతా నా సొంతమైనట్లు అనిపించింది’ అంటూ తన భర్తను ఉద్దేశించి కామెంట్ పెట్టి ఫొటోలు షేర్ చేసింది. అయితే తమ పెళ్లి ఎక్కడ జరిగిందనే విషయాన్ని ఆమె వెల్లడించలేదు. కాని ఆమె ఫోటోలు చూస్తే మాత్రం చాలా గ్రాండ్ గానే పెళ్ళి చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనితో సోషల్ మీడియా వేదికగా అభిమానులు, నెటిజన్లు, సినీ ప్రముఖులు నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Natasha Doshi Marriage Updates
ముంబయికి చెందిన నటాషా 2012లో మలయాళ చిత్రం ‘మాంత్రికన్’తో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత మరో మూడు మలయాళ సినిమాల్లో నటించారు. 2018లో వచ్చిన బాలకృష్ణ చిత్రం ‘జై సింహా’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత శ్రీకాంత్ సరసన ‘కోతల రాయుడు’, 2020లో కల్యాణ్ రామ్ హీరోగా వచ్చిన ‘ఎంత మంచి వాడవురా’ సినిమాలో ప్రత్యేక గీతంలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. గతేడాది జూలైలో మనన్ షా అనే వ్యాపారవేత్తతో నిశ్చితార్ధం జరిగినట్లు ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే పెళ్ళి ఎప్పుడనేది త్వరలో చెప్తానని అప్పట్లో ప్రకటించింది. అయితే సైలంట్ గా పెళ్లి చేసుకున్న తరువాత… ఆ ఫోటోలను షేర్ చేసింది నటాషా.
Also Read : Abraham Ozler : ఓటీటీలో రాబోతున్న మలయాళ బ్లాక్ బస్టర్ ‘అబ్రహం ఒజ్లర్’