Natasa Stankovic: ఇటీవలే భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో విడాకులు తీసుకున్న నటి, మోడల్ నటాసా స్టాంకోవిచ్ ప్రస్తుతం ముంబయిలో చిల్ అవుతోంది. విడాకుల తర్వాత సెర్బియా వెళ్లిపోయిన నటాషా దాదాపు రెండు నెలల తర్వాత తిరిగి ఇండియాకు వచ్చింది. అయితే ఆమెతో పాటు బాయ్ ఫ్రెండ్ అలెగ్జాండర్ ఇలాక్ కూడా ఉన్నారు. వీరిద్దరు కారులో ప్రయాణిస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
Natasa Stankovic…
కాగా.. అంతకుముందే తాను ముంబయికి వచ్చిన విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. తన కుమారుడు అగస్త్యతో పాటు ఇండియాకు వచ్చినట్లు తెలిపింది. ఇటీవల తన కొడుకు పుట్టినరోజును సెర్బియాలో తన కుటుంబం, బంధుమిత్రులతో కలిసి జరుపుకుంది. బర్త్ డేకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.
కాగా.. నటాసా స్టాంకోవిచ్(Natasa Stankovic) మొదట యాడ్స్‌లో నటించడం ద్వారా తన కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత ప్రకాష్ ఝా తెరకెక్కించిన సత్యాగ్రహం మూవీతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. అయితే ఈ చిత్రంలో ప్రత్యేక సాంగ్‌లో మెరిసింది. అంతేకాకుండా డిష్కియావూన్, యాక్షన్ జాక్సన్, 7 అవర్స్ టు గో, జీరో వంటి చిత్రాల్లో కనిపించింది. టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో పరిచయం ఏర్పడి, ప్రేమగా మారి పెళ్ళి చేసుకుంది. ఆ తరువాత ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే వీరిద్దరి మధ్య మనస్పర్దలు రావడంతో… ఇటీవల విడాకులు తీసుకున్నారు.
Also Read : Maa Nanna Superhero: సుధీర్ బాబు ‘మా నాన్న సూపర్‌హీరో’ టీజర్ వచ్చేసింది!