Narne Nithin: ‘ఆయ్’ సక్సెస్‌ తో దసరా బరిలోకి ఎన్టీఆర్ బావమరిది !

‘ఆయ్’ సక్సెస్‌ తో దసరా బరిలోకి ఎన్టీఆర్ బావమరిది !

Narne Nithin: ఎన్టీఆర్ బావమరిదిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన నార్నె నితిన్… వరుస హిట్లతో దూసుకుపోతున్నారు. మ్యాడ్, ఆయ్ వంటి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చిత్రాల హిట్‌తో సక్సెస్‌ ఫుల్ హీరోగా దూసుకుపోతున్న నార్నె నితిన్… ఇదే ఊపుతో ఇప్పుడు హ్యాట్రిక్‌పై కన్నేశారు. జాతీయ అవార్డు విన్నర్, ‘శతమానం భవతి’ దర్శకుడు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తాజాగా ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ చిత్రంలో నటిస్తున్నారు. నితిన్ సరసన సంపద హీరోయిన్ గా నటిస్తున్నారు. రావు రమేష్, నరేష్, రఘు కుంచె, ప్రవీణ్, రచ్చ రవి, సరయు, రమ్య, ప్రియ మాచిరాజు, భద్రం, ఆనంద్, జబర్దస్త్ నాగి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. శ్రీ వేధాక్షర మూవీస్ పతాకంపై చింతపల్లి రామారావు నిర్మించిన ఈ సినిమాను దసరా బరిలో దింపేందుకు మేకర్స్ నిర్ణయం తీసుకున్నారు. అన్నికమర్షియల్ ఎలిమెంట్స్‌తో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం దసరా కానుకగా ప్రేక్షకులకు ముందుకు రానుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

Narne Nithin Movie..

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత చింతపల్లి రామారావు మాట్లాడుతూ… మా చిత్ర హీరో నార్నె నితిన్(Narne Nithin) ఇటీవల మంచి ఫీల్ గుడ్, యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీస్‌తో వరుస విజయాలు అందుకున్నారు. వీటికి భిన్నంగా మా సినిమా వుంటుంది. పూర్తి కమర్షియల్ ఫార్మాట్‌లో భారీ తారాగణంతో ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు సతీష్ వేగేశ్న. ఎన్టీఆర్ ఎంతో మెచ్చి.. ఈ కథను ఎంపిక చేశారు. ఆయన అంచనాల మేరకు దర్శకుడు ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీపడకుండా తెరకెక్కించారు. కచ్చితంగా ఈ దసరాకి నార్నె నితిన్ ఖాతాలో ఆయ్, మ్యాడ్ తరహాలో హ్యాట్రిక్ హిట్ పడుతుందని గట్టిగా నమ్ముతున్నామని అన్నారు.

వాస్తవానికి ఎన్టీఆర్ బావమరిదిగా నార్నె నితిన్ ఈ సినిమాతోనే ఇండస్ట్రీకి పరిచయం కావాలి. అప్పట్లో కాస్త హడావుడి చేశారు కానీ.. ఆ తర్వాత ఎందుకనో ఈ సినిమాను పక్కన పెట్టేశారు. ఇప్పుడు నార్నె నితిన్ నటించిన ‘మ్యాడ్, ఆయ్’ చిత్రాలు సక్సెస్ సాధించడంతో.. ఈ సినిమాను ధైర్యంగా విడుదలకు తీసుకువస్తున్నారు. కచ్చితంగా ఈ సినిమాతో నార్నె నితిన్ హ్యాట్రిక్ కొడతాడని మేకర్స్ చెబుతున్నారు.

Also Read : Hema: సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం పవన్ అపాయింట్‌మెంట్‌ అడుగుతున్న హేమ !

AayMadhavilathaNarne NithinSri Sri Sri Rajavaru
Comments (0)
Add Comment