Naresh Vijayakrishna: సినీ నటుడు నరేష్ కి అరుదైన గౌరవం

సినీ నటుడు నరేష్ కి అరుదైన గౌరవం

Naresh Vijayakrishna : టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ గురించి పరిచయం చేయాల్సిన పనిలేదు. సినిమాలతో పాటు వ్యక్తిగత జీవితంలో ఉన్న కాంట్రవర్సీలతో నిత్యం వార్తల్లో ఉండే వ్యక్తి నరేష్. సూపర్ స్టార్ కృష్ణ, విజయనిర్మల వారసుడిగా సినిమాల్లో అడుగుపెట్టిన నరేష్ వియజకృష్ణ(Naresh Vijayakrishna)… విభిన్నమైన పాత్రలు పోషిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. జంధ్యాల సినిమాలతో హాస్య నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న నరేష్… ఇటీవలే సినిమా ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తిచేసుకుని గోల్డెన్ జూబ్లీ జరుపుకున్నారు. ఇప్పటికే మూడు పెళ్ళిళ్ళు చేసుకున్న నరేష్… తాజాగా పవిత్ర లోకేష్ తో సహాజీవనం, పెళ్ళి అంటూ ఇటీవల వార్తల్లోకి ఎక్కాడు. అయితే వ్యక్తిగత జీవితం గురించి కాసేపు ప్రక్కన పెడితే… ఫిలిప్పీన్స్‌ రాజధాని మనీలాలో ఇటీవల జరిగిన 5వ ప్రపంచ కాంగ్రెస్‌ సమావేశాల్లో ప్రముఖ నటుడు నరేశ్‌ విజయకృష్ణకి అరుదైన గౌరవం లభించింది.

Naresh Vijayakrishna – మిలటరీ ఆర్ట్స్‌ గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా నరేష్

నేషనల్ అకాడమీ ఆఫ్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ ప్లానింగ్ (NASDP), ఇంటర్నేషనల్ స్పెషల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ & హ్యూమన్ రైట్స్ సంయుక్తంగా ఈ నెల 24న ఫిలిప్పీన్స్ (మనీలా)లోని క్యూజోన్ నగరంలో 5వ ప్రపంచ కాంగ్రెస్ ని నిర్వహించింది. ఫిలిప్పీన్స్ దేశ పాలసీ అడ్వైజర్ చీఫ్ మిస్ క్లారిటా ఆర్ కార్లోస్, ఢిపెన్స్ కు చెందిన ఉన్నతాధికారులు, వివిధ దేశాల డిప్యూటీ మంత్రులు, దౌత్యవేత్తలు, హాజరైన ఈ కార్యక్రమానికి ఇండియా నుంచి నరేష్ విజయకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉగ్రవాదంపై నరేష్ చేసిన ఉపన్యాసాలు ప్రశంసలు అందుకున్నాయి. దీనితో నరేష్ ను మిలటరీ ఆర్ట్స్‌ గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా, లెఫ్టినెంట్‌ కల్నల్‌గా నియమించడంతో పాటు నైట్ హుడ్ అత్యున్నత బిరుదు ‘సర్’ ను ప్రదానం చేశారు. దేశంలో ఇలాంటి గౌరవాలు, నియామకాల్ని అందుకున్న తొలి నటుడుగా నరేష్ రికార్డుల్లోకెక్కారు.

విదేశీ అతిథులను ఆకట్టుకున్న సర్ నరేష్ ప్రసంగం

ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ ప్రభుత్వాలు, ఐక్యరాజ్యసమితి సంస్థలతో పాటు ఉగ్రవాదాన్ని నిర్వీర్యం చేయడం, అరికట్టడంలో మీడియాకు గొప్ప బాధ్యత వుందని చెప్పారు. ఉగ్రవాదాన్ని అరికట్టడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ సమావేశాల ఉద్దేశాన్ని ఓ దౌత్యవేత్తగా, కళాకారుడిగా ప్రజల్లోకి తీసుకెళతానని తెలిపారు. ప్రముఖ నటి పవిత్రా లోకేష్ కూడా ఈ సమావేశానికి హాజరై కళారంగంలో అందించిన సేవలకుగాను మెడల్ అందుకున్నారు.

నరేష్ కేరాఫ్ కాంట్రవర్సీ

ప్రముక దర్శకురాలు, నటీమణి, సూపర్ స్టార్ కృష్ణ భార్య విజయనిర్మల వారసుడు నరేష్ విజయకృష్ణ. బాలనటుడిగా 1972లో పండంటి కాపురం చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేసిన నరేష్…1982లో ఇతని తల్లి విజయ నిర్మల దర్శకత్వంలో ప్రేమ సంకెళ్ళు సినిమాలో హీరోగా నటించాడు. ఆ తరువాతి కాలంలో శ్రీవారికి ప్రేమలేఖ, చిత్రం భళారే విచిత్రం, జంబలకిడి పంబ వంటి అనేక హాస్య ప్రధాన చిత్రాలలో నటించి నటుడిగా మంచిపేరు తెచ్చుకున్నాడు. వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే… మహేష్ బాబుకు సోదరుడు అయినప్పటికీ ఎప్పుడూ ఆ కుటుంబంతో కలిసి ఉన్న సందర్భాలు లేవు. తన 50వ సంవత్సరంలో ఏపికు చెందిన ప్రముఖ కాంగ్రెస్ నాయకుడికి కుటుంబానికి చెందిన రమ్య అనే మహిళను మూడో పెళ్ళి చేసుకున్నాడు. అయితే వారిద్దరి మధ్య ఏర్పడిన మనస్పర్థల కారణంగా… ఆమెకు దూరంగా ఉంటూ ఇటీవల తన సహనటి పవిత్ర లోకేష్ తో ఉంటున్నాడు. సహజీవనం, పెళ్ళి పేరుతో నరేష్, పవిత్ర లోకేష్ ఇద్దరూ నిత్యం వార్తల్లోకి నిలుస్తున్నారు.

Also Read : Ileana d’cruz: ఎట్టకేలకు తన భర్త వివరాలు బయటపెట్టిన ఇలియానా

Naresh Vijayakrishnapavitra lokesh
Comments (0)
Add Comment