Nara Rohit : త్వరలో ఆ హీరోయిన్ తో పెళ్లిపీటలెక్కనున్న నారా రోహిత్

ఈ నెల 13న నారా రోహిత్ నిశ్చితార్థం జరగనుందని నెట్టింట ప్రచారం జరుగుతోంది...

Nara Rohit : టాలీవుడ్ హీరో నారా రోహిత్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ్ముడి కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు నారా రోహిత్(Nara Rohit). మొదటి సినిమా బాణంతోనే మంచి నటుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. ఆ తర్వాత సోలో సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. రౌడీ ఫెలో, అప్పట్లో ఒకడు ఉండేవాడు, ఒక్కడినే, ప్రతినిధి, అసుర, రాజా చేయి వేస్తే, జో అచ్చుతానంద, శంకర, శమంతక మణి, కథలో రాజకుమారి, బాలకృష్ణుడు, ఆటగాళ్లు, వీర భోగ వసంత రాయలు, ప్రతినిధి 2.. ఇలా పలు సినిమాలతో ఆడియెన్స్ కు బాగా చేరువై పోయాడు నారా రోహిత్.

టాలీవుడ్ లో వైవిధ్యమైన కథలతో సినిమాలు తీసే హీరోల్లో ఒకడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 2018 తర్వాత సుమారు ఆరేళ్ల పాటు గ్యాప్ తీసుకున్న రోహిత్ ఈ ఏడాది ప్రతినిధి 2 సినిమాతో ఆడియెన్స్ ను పలకరించాడు. సినిమాల సంగతి పక్కన పెడితే.. నారా రోహిత్(Nara Rohit) తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. అదేనండి.. త్వరలోనే ఈ నారావారబ్బాయి ఓ ఇంటి వాడు కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరికొన్ని రోజుల్లో ఈ టాలీవుడ్ బ్యాచిలర్ లైఫ్ కి బై బై చెప్పి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టనున్నాడని రూమర్లు వినిపిస్తున్నాయి.

Nara Rohit…

ఈ నెల 13న నారా రోహిత్ నిశ్చితార్థం జరగనుందని నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఈ హీరో నటించిన ప్రతినిధి -2 సినిమాలోని హీరోయిన్ సిరి లేళ్లతో ఉంగరాలు మార్చుకోనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో జరిగే ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, నందమూరి బాలకృష్ణ ఫ్యామిలీలు కూడా హాజరుకాబోతున్నాయని సమాచారం. అయితే నారా రోహిత్ నిశ్చితార్థం, పెళ్లి గురించి హీరో నుంచి కానీ అతని కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇక నారా రోహిత్ హీరోగా నటించిన ‘సుందరకాండ’ అనే సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. కొద్ది రోజుల క్రితమే ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. లేటు వయసులో పెళ్లి చేసుకోవడం అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా సాగుతుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.

Also Read : Vishnu Priya-BB8 : బిగ్ బాస్ హౌస్ లో సిగరెట్ తాగుతూ పట్టుబడ్డ విష్ణు ప్రియ

marriageNara RohitTrendingUpdatesViral
Comments (0)
Add Comment