Nara Rohit Movie : ‘సుందరకాండ’ అనే మరో కొత్త సినిమాతో వస్తున్న నారా రోహిత్

అందులో రోహిత్ ఇన్నోసెంట్ లుక్స్‌లో కూల్ డ్రెస్‌లో క్లాసీ, ఛార్మింగ్ గా కనిపించారు...

Nara Rohit : నారా రోహిత్ హీరోగా వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వంలో ‘సుందరకాండ’ చిత్రం తెరకెక్కుతుంది. సందీప్ పిక్చర్ ప్యాలెస్ (SPP) బ్యానర్‌పై సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి ఈ ఫన్ ఫిల్డ్ రోమ్-కామ్‌ను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఏ చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నారు నారా రోహిత్. అయన నటిస్తున్న 20వ చిత్రమిది. నేడు నారా రోహిత్‌కి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ మేకర్స్ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు.

Nara Rohit Movies Update

అందులో రోహిత్ ఇన్నోసెంట్ లుక్స్‌లో కూల్ డ్రెస్‌లో క్లాసీ, ఛార్మింగ్ గా కనిపించారు. “No two love stories are the same,” as the saying goes. చక్కని ప్రేమకథతో ఈ చిత్రం రూపొందుతుందని మేకర్స్ తెలిపారు. త్వరలో టీజర్‌ను త్వరలో విడుదల చేయనున్నారు. నారా రోహిత్ సరసన విర్తి వాఘని హీరోయిన్‌గా నటిస్తుండగా, శ్రీ దేవి విజయ్ కుమార్, నరేష్ విజయ కృష్ణ, వాసుకి ఆనంద్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రదీప్ ఎమ్ వర్మ సినిమాటోగ్రఫీ అందించగా, లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు.

Also Read : Kho Kho OTT : మమిత బైజు నటించిన ‘ఖో ఖో’ స్పోర్ట్స్ డ్రామా ఆ ఓటీటీలో..

MoviesNara RohitTrendingUpdatesViral
Comments (0)
Add Comment