Nara Rohit : ప్రతినిధి 2 హీరోయిన్ తో పెళ్లి పీటలెక్కనున్న నారా రోహిత్

ప్రస్తుతం ఈయన ప్రతినిధి 2 సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది...

Nara Rohit : తొలి సినిమా ‘బాణం’తోనే ప్రేక్షకులని ఆకట్టుకున్న హీరో నారా రోహిత్. సినీ ఇండస్ట్రీలో నీట్ అండ్ కామ్ పర్సనాలిటీ మెయింటేన్ చేస్తుంటాడు. ప్రతినిధి సినిమాతో ఆడియెన్స్‌కి మంచి కిక్కిచ్చిన రోహిత్(Nara Rohit).. ఆ మూవీ సీక్వెల్ ప్రతినిధి 2తో మాత్రం నిరాశపరిచాడు. ఇదంతా పక్కన పెడితే ఇండస్ట్రీలోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో రోహిత్ ఒకరు. తాజాగా ఆయన పెళ్ళికి సంబంధించిన అప్డేట్ ఒకటి సందడి చేస్తుంది. అది కూడా ఒక హీరోయిన్‌ని ప్రేమించి పెళ్లిచేసుకోనున్నట్లు సమాచారం.

ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు.. పెళ్లెప్పుడంటే.. సాక్షాత్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తమ్ముడి కుమారుడైన రోహిత్ ఇండస్ట్రీలో మంచి సినిమాలతో పర్వాలేదనిపిస్తునాడు. భారీ హిట్లు లేకపోయినా డిజాస్టర్ కథలు కూడా తీయకపోవడంతో కెరీర్ సాఫీగానే సాగుతోంది. అయితే వయసు మాత్రం నాలుగు పదులు దాటడంతో పెళ్లి చేసేయాలని నారా ఫ్యామిలీ ఫిక్స్ అయిపోయిందంట. అంతే కాదు త్వరలోనే పెళ్ళికి ముహర్తం కూడా ఫిక్స్ చేశారు. ఈ నెల 13నే ఎంగేజ్మెంట్. ప్రతినిధి 2 సినిమాలో హీరోయిన్‌గా చేసిన ‘సిరి’ ని రోహిత్(Nara Rohit) ప్రేమించాడట. ఈ జంట పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్దపడటంతో వధువుని ప్రత్యేకంగా వెతికే పని లేకుండా చేశావు అంటూ నారా ఫ్యామిలీ ఖుషి అవుతోంది.

Nara Rohit Marriage Updates

ప్రస్తుతం ఈయన ప్రతినిధి 2 సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. టీజర్, ట్రైలర్‌ల‌తోనే మంచి హైప్ తెచ్చుకున్న ఈ మూవీ కొన్నాళ్లు చ‌ర్చ‌ల్లో బాగా నిలిచింది. అయితే సీఎం మరణం.. అతని కొడుకుని సీఎం చేయాలని పట్టుబట్టడం.. సంక్షేమ పథకాలపై సెటర్లు.. అభివృద్ధి జరగలేదనే విమర్శలు.. ఇవన్నీ అధికార వైసీపీ పార్టీకి కనెక్ట్ అయ్యే అంశాలుగా ఉన్నా.. కథ పరంగా ఆ పార్టీని కెలికే ప్రయత్నం అయితే చేయలేదు. కేవలం సీఎం మర్డర్ మిస్టరీ చుట్టూ పొలిటికల్ డ్రామా మాత్రమే చూపించారు. అక్కడక్కడా పొలిటికల్ సెటైర్లు వేయించినా.. సెన్సార్‌ బీప్‌లు చాలా చోట్ల కనిపించాయి. ఈ సినిమా చాలా వరకూ టీవీ డిస్కషన్స్ బ్రేకింగ్ న్యూస్‌ల చుట్టూ తిరగడంతో.. చాలామందికి బోరింగ్ అనిపించే అవ‌కాశం ఉంది. ఎక్కువ‌గా సీన్లు వాస్తవ దూరంగా కూడా అనిపిస్తాయి.

Also Read : Samantha : ఇక నుంచి సమంత టాలీవుడ్ వైపుకూడా చుడనున్నారా..!

marriageNara RohitTrendingUpdatesViral
Comments (0)
Add Comment