Nara Rohit Engagement : ఒక ఇంటివాడు కాబోతున్న హీరో నారా రోహిత్

తన కంటే తన సినిమాలు మాట్లాడితేనే బాగుంటుందని భావిస్తుంటారు నారా రోహిత్...

Nara Rohit : టాలెంటెండ్ హీరో నారా రోహిత్ ఓ ఇంటివాడు కాబోతున్నారు. ఆయన రీసెంట్‌గా నటించిన ‘ప్రతినిధి 2’ హీరోయిన్ శిరీషా లెల్లను వివాహమాడబోతున్నారు. నారా రోహిత్(Nara Rohit), శిరీషా లెల్ల నిశ్చితార్థం 13 అక్టోబర్, ఆదివారం హైదరాబాద్‌లోని హైటెక్స్ నోవాటెల్‌లో గ్రాండ్‌గా జరిగింది. వీరిద్దరి పెళ్లి డిసెంబర్ 15న జరగనుందని తెలుస్తోంది. ఇక ఈ నిశ్చితార్థానికి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో పాటు నారా, నందమూరి కుటుంబ సభ్యులంతా హాజరయ్యారు. నారా రోహిత్, శిరీషా లెల్ల ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించి తాజాగా కొన్ని ఫొటోలు బయటికి వచ్చాయి. ఈ ఫొటోలలో కాబోయే నూతన జంట ఎంతో ఆనందంగా, హుషారుగా కనిపిస్తున్నారు. సాంప్రదాయ దుస్తుల్లో తెలుగుదనం ఉట్టిపడేలా ఉన్న వీరిద్దరి ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Nara Rohit Engagement Updates

నారా రోహిత్ విషయానికి వస్తే.. తొలి చిత్రం ‘బాణం’తోనే ప్రేక్షకులని ఆకట్టుకుని హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం పొందారు. ‘ సోలో’ ఆయన కెరీర్‌లోనే బెస్ట్ సినిమాగా ఇప్పటికీ చెప్పబడుతుంది. సినీ ఇండస్ట్రీలో నీట్ అండ్ కామ్ పర్సనాలిటీని మెయింటైన్ చేస్తూ.. తన కంటే తన సినిమాలు మాట్లాడితేనే బాగుంటుందని భావిస్తుంటారు నారా రోహిత్(Nara Rohit). అందుకే వైవిధ్యమైన చిత్రాలను సెలక్ట్ చేసుకుంటూ.. ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకున్నారు.

ఆయన నుండి సినిమా వస్తుందంటే.. అందులో ఏదో ఒక మంచి కంటెంట్ ఉంటుందనేలా ప్రేక్షకులలో పేరుని పొందారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తమ్ముడి కుమారుడైన నారా రోహిత్.. తన పెదనాన్న పేరుని మాత్రం ఎప్పుడూ వాడుకోలేదు. తన కష్టాన్ని నమ్ముకునే హీరోగా ఎదిగారు. ప్రస్తుతం నారా రోహిత్ వయసు నాలుగు పదులు దాటడంతో.. నారా ఫ్యామిలీ ఆయనని పెళ్లి చేసుకోవాలని కోరడంతో.. ‘ప్రతినిధి 2’ సినిమాలో తన సరసన నటించిన సిరితో ఉన్న ప్రేమ వ్యవహారం ఇంట్లో చెప్పి, ఒప్పించి పెళ్లికి సిద్ధమయ్యారు. కాబోయే ఈ నూతన జంటకు నారా, నందమూరి ఫ్యామిలీ పెద్దలందరూ ఆశీస్సులు అందిస్తున్నారు.

Also Read : Sardar 2 Movie : హీరో కార్తీ సినిమా ‘సర్దార్ 2’ షూటింగ్ మొదలు

marriageNara RohitTrendingUpdatesViral
Comments (0)
Add Comment