Nara Rohit : తండ్రి మరణం తర్వాత ‘నారా రోహిత్’ ఎమోషనల్ పోస్ట్

ఈ ప్రమాదం జరిగిన వెంటనే, మంత్రి నారా లోకేష్ అసెంబ్లీ వదిలి వెంటనే హైదరాబాద్‌కు చేరుకున్నారు...

Nara Rohit : నారా రోహిత్ తండ్రి, రామ్మూర్తి నాయుడు గారు (72) శనివారం గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషాదంతో నారా, నందమూరి కుటుంబాలలో తీవ్ర శోక వాతావరణం నెలకొంది. రామ్మూర్తి నాయుడు గారు గత వారం నుండి ఆరోగ్య స‌మ‌స్య‌లతో హైదరాబాద్‌లోని AIG హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ, శనివారం తీవ్రంగా అస్వస్థతకు గురై గుండెపోటుతో మరణించారు.

Nara Rohit Emotional Tweet

ఈ ప్రమాదం జరిగిన వెంటనే, మంత్రి నారా లోకేష్ అసెంబ్లీ వదిలి వెంటనే హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఢిల్లీలో పర్యటిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పర్యటనను మధ్యలో ఆపి, హైదరాబాద్‌ బయలుదేరారు. రామ్మూర్తి నాయుడు గారి పార్థివదేహాన్ని బేగంపేట్ విమానాశ్రయం నుండి రేణిగుంటకు తరలించి, స్వస్థలం నారావారిపల్లెలో మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

ఈ విషాద సమయంలో, నారా రోహిత్(Nara Rohit) తన తండ్రిని స్మరించుకుంటూ తన ఫీలింగ్స్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. “మీరు ఒక ఫైటర్ నాన్నా… నాకు ప్రేమించడం, జీవితాన్ని గెలవడం నేర్పించారు. ఈ రోజు నేను ఇంత స్థాయిలో ఉన్నందుకు మీరు కారణం. మీరు జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొనినప్పటికీ మా దరికి వాటిని రానీయకుండా పెంచారు. నాకు ఏం చెప్పాలో తెలియక పోతుంది… బై నాన్నా” అంటూ భావోద్వేగపూరితంగా పోస్ట్ చేశారు. రామ్మూర్తి నాయుడు గారి మరణంపై సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు.

Also Read : Priyadarshi : ప్రియదర్శి ‘సారంగపాణి జాతకం’ సినిమాపై కీలక అప్డేట్

Nara RohitTweetUpdatesViral
Comments (0)
Add Comment