Kalki 2898 AD: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కించిన అతి భారీ బడ్జెట్ సినిమా ‘కల్కి 2898 ఏడీ’. లార్జ్ దెన్ లైఫ్, మైథాలజీ ఇన్స్పైర్డ్ ఫ్యుచరిస్ట్ సైన్స్ ఫిక్షన్ గ్లోబల్ ఫిల్మ్ లో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటాని ఇతర కీలక పాత్రల్లో నటించారు. వైజయంతి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత అశ్విన్ దత్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా గురువారం విడుదలై… బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై రాజకీయ, సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా మూవీ టీమ్‌కు శుభాకాంక్షలు చెబుతున్నారు.
తాజాగా ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) ‘కల్కి 2898 ఏడీ(Kalki 2898 AD)’ టీమ్‌ను అభినందిస్తూ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. సినిమాకు వస్తోన్న అద్భుతమైన రివ్యూలు వినడం చాలా సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణెలకు అభినందనలు తెలిపారు. గొప్ప సినిమాను తెరకెక్కించారంటూ నాగ్ అశ్విన్ కు ధన్యవాదాలు చెప్పారు. తెలుగు సినిమాను గ్లోబల్ స్థాయికి తీసుకువెళ్లేందుకు కృషి చేశారంటూ నిర్మాతలకు శుభాకాంక్షలు తెలిపారు.
‘కల్కి 2898 ఏడీ’ సినిమా విడుదలకు ముందు అశ్వనీదత్ తో పాటు టాలీవుడ్ కు చెందిన ప్రముఖ నిర్మాతలు… ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సమస్యలు, అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ భేటీ అయిన 48 గంటల్లోనే ‘కల్కి 2898 ఏడీ’ సినిమాకు సంబంధించి స్పెషల్ షోలతో పాటు టిక్కెట్ల రేట్లు పెంపు కోసం ప్రభుత్వం అనుమతులు జారీ చేస్తూ ప్రత్యేకంగా జీవోను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి నారా లోకేశ్ ఈ సినిమా విజయంపై ట్వీట్ చేయడం ప్రాథాన్యత సంతరించుకుంది.
Kalki 2898 AD – ‘కల్కి 2898 ఏడీ’ సినిమాపై ప్రముఖుల ప్రశంసలు !
అంతర్జాతీయ స్థాయి చిత్రం. పురాణాలకు సైన్స్‌ను ముడిపెట్టి తీసిన మాస్ ఇండియన్ ఫిల్మ్… తెలుగు ల్యాండ్ నుంచి చూస్తారా ? అయితే ‘కల్కి 2898 ఏడీ’ని చూడండి. నాగ్ అశ్విన్, ప్రభాస్ అన్న, వైజయంతీ మూవీస్‌తో పాటు చిత్రబృందం అందరికీ శుభాకాంక్షలు. ఎంతో గర్వంగా ఉంది – నాని
నలుమూలల నుంచి బ్లాక్‌బస్టర్ టాక్ వినిపిస్తోంది. టీమ్‌కు శుభాకాంక్షలు. నాగ్ అశ్విన్ విజన్‌కు హ్యాట్సాఫ్. నిర్మాత దూరదృష్టి, అంకితభావం ఈ పురాణకథకు ప్రాణం పోశాయి. భారతీయ సినీ రంగంలో ‘కల్కి’ ఓ మైలురాయి. – మంచు మనోజ్.
Also Read : Game Changer: ‘గేమ్ ఛేంజర్’ పై కీలక అప్‌డేట్ ఇచ్చిన శంకర్ !