Saripodhaa Sanivaaram OTT : ఓటీటీ కి సిద్ధమైన హీరో నాని ‘సరిపోదా శనివారం’ సినిమా

సరిపోదా శనివారం మూవీ ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడైందని తెలుస్తోంది...

Saripodhaa Sanivaaram : నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ సరిపోదా శనివారం. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమా రీసెంట్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. గతంలో వివేక్ ఆత్రేయ నాని కాంబినేషన్ లో అంటే సుందరానికి అనే సినిమా వచ్చింది. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత ఇప్పుడు సరిపోదా శనివారం అనే సినిమా చేశారు.

సరిపోదా శనివారం(Saripodhaa Sanivaaram) ఆగస్టు 29 న థియేటర్ లో రిలీజై హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో నాని సూర్య అనే పాత్రలో నటించాడు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించింది. సరిపోదా శనివారం సినిమాలో ఎస్జే సూర్య విలన్ గా నటించారు. నాని, ఎస్ జే సూర్య తమ పాత్రల్లో పోటాపోటీగా నటించారు. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేశారు. విడుదలైన అన్ని భాషల్లో ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా కలెక్షన్స్ పరంగాను మంచి వసూళ్లను రాబడుతోంది. థియేటర్స్ లో కలెక్షన్స్ దూసుకుపోతున్న ఈ మూవీ ఎప్పుడు ఎప్పుడు ఓటీటీకి వస్తుందా అని కొంతమంది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Saripodhaa Sanivaaram OTT Updates

సరిపోదా శనివారం మూవీ ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడైందని తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సరిపోదా శనివారం సినిమా ఓటీటీ రైట్స్ ను ఫ్యాన్సీ రేటుకు దక్కించుకుందని తెలుస్తోంది. అలాగే ఈ సినిమా సెప్టెంబర్ 27 నుంచి ఓటీటీల స్ట్రీమింగ్ కానున్నట్లు టాక్ వినిపిస్తుంది. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత ఉందో తెలియదు కానీ ఈ టాక్ ఫిలిం సర్కిల్ లో చక్కర్లు కొడుతోంది. సరిపోదా శనివారం సినిమా ఓటీటీ రిలీజ్ పై మేకర్స్ కానీ, ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. త్వరలోనే ఈ మూవీ ఓటీటీ డేట్ ను అనౌన్స్ చేసే అవకాశం ఉంది.

Also Read : Satya Movie OTT : ఓటీటీలో తమిళ బ్లాక్ బస్టర్ సినిమా ‘సత్య’ ఇప్పుడు తెలుగులో

Hero NaniOTTSaripodhaa SanivaaramTrendingUpdatesViral
Comments (0)
Add Comment