Hit 3 : టాలీవుడ్ లో సంచలనంగా మారారు నేచురల్ స్టార్ నాని. తను ఎంచుకునే పాత్రలు , కథలు డిఫరెంట్ గా ఉంటాయి. తనకంటూ ఓ టీం ఉంది. నటుడిగానే కాదు నిర్మాతగా కూడా కొత్త అవతారం ఎత్తాడు. ఈ మధ్యనే ప్రియదర్శి, హర్ష వర్దన్ తో కలిసి కోర్ట్ మూవీ నిర్మించాడు. తక్కువ బడ్జెట్ తో తీసిన ఈ మూవీ భారీ ఆదాయాన్ని మిగిల్చింది. తాజాగా తను సినిమాలలో బిజీగా ఉన్నారు. ది ప్యారడైజ్ తో పాటు హిట్ 3 పేరుతో రానున్నాయి ప్రేక్షకుల ముందుకు.
Hit 3 Movie Updates
హిట్ -3(Hit 3)కి సంబంధించిన పోస్టర్స్, టీజర్, సాంగ్ కు మంచి ఆదరణ లభించింది. తాజాగా మూవీ మేకర్స్ కీలక ప్రకటన చేశారు. మే 1వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా చిత్రాన్ని విడుదల చేస్తామంటూ ప్రకటించారు మూవీ మేకర్స్. నాని నటించిన హాయ్ నాన్నా, సరిపోదా శనివారం బిగ్ హిట్స్ సాధించాడు. అదే ఊపును కంటిన్యూ చేస్తున్నాడు. ఈ మధ్యన విడుదల చేసిన ద ప్యారడైజ్ టీజర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక హిట్ 3 పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. తను కూడా కీలక ప్రకటన చేశాడు నాని కోర్టు మూవీ ఈవెంట్ సందర్బంగా.
కోర్ట్ చిత్రం నచ్చక పోతే హిట్ 3 చూడవద్దంటూ స్పష్టం చేశాడు. ఆయన చేసిన కామెంట్స్ టాలీవుడ్ లో కలకలం రేపాయి. ఆయన చెప్పినట్లుగానే భారీ వసూళ్లు సాధించింది. ఇప్పుడు హిట్ 3 పై కూడా ఫ్యాన్స్ నమ్మకం పెట్టుకున్నారు. తప్పకుండా సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాడు నేచురల్ స్టార్ నాని. ఈ చిత్రానికి శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు. యంగ్ బ్యూటీ శ్రీనిధి మరో పాత్రలో నటిస్తుండగా ప్రశాంత్ త్రిపురనేని నిర్మిస్తున్నాడు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తుండడం విశేషం.
Also Read : Payal Rajput Shocking :ప్రతిభ ఉన్నా పట్టించు కోవడం లేదు