Nani : నేచురల్ స్టార్ నాని భిన్నమైన పాత్రలు ఎంచుకుంటున్నాడు. ప్రతి సినిమా బలమైన ముద్ర వేసేలా జాగ్రత్త పడుతున్నాడు. అందుకే తను చేస్తున్న మూవీస్ కు ఎలాంటి ప్రచార ఆర్భాటం లేకుండానే బిగ్ సక్సెస్ అవుతున్నాయి. ఓ వైపు నటిస్తూనే ఇంకో వైపు నిర్మాతగా మారడం విశేషం. మనోడు దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దు కోవాలనే ఆలోచనతో ముందుకు వెళుతున్నట్లు కనిపిస్తోంది.
Nani ‘The Paradise Raw Statement’ Teaser Viral
ఇప్పటికే హాయ్ నాన్నతో సక్సెస్ అందుకున్న నాని(Nani) గత ఏడాది 2024లో సరిపోదా శనివారం మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. తాజాగా మరో మూవీకి సంబంధించి కీలక అప్ డేట్ ఇచ్చాడు. అదే ది ప్యారడైజ్ రా స్టేట్ మెంట్. ఇందులోని డైలాగులు రోమాలు నిలబడేలా ఉన్నాయి. ఇది కథ కాదు. అన్నింటికన్నా అభూత కల్పన కానే కాదు.
ఇది వాస్తానికి కడుపు మండిన కాకుల కథ అంటూ ఓ బోల్డ్ స్టేట్ మెంట్ ఇచ్చాడు. కడుపు మండిన కాకుల కథ.. ఇరగదీసిన నాని.. ది ప్యారడైజ్ రా స్టేట్‌మెంట్. ఇప్పటికే తను హిట్ 3 తో ముందుకు వస్తున్నాడు. ఇటీవలే దీనికి సంబంధించిన టీజర్ రిలీజ్ అయ్యింది. దీనికి భారీ స్పందన లభించింది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తను నటించిన దసరా మాస్ హిట్ గా నిలిచింది. తన దర్శకత్వంలో మరో మూవీ చేయబోతుండడం విశేషం. ఈ మూవీకి ది ప్యారడైజ్ అని పేరు ఖరారు చేశారు. ఇది పూర్తిగా తెలంగాణ యాసలో వస్తున్న సినిమా కావడం విశేషం.
Also Read : Hero Sandeep Kishan :తలైవా కూలీ బ్లాక్ బస్టర్ పక్కా