Saripodhaa Sanivaaram OTT : ఓటీటీలో సందడి చేస్తున్న నాని, ఎస్ జె సూర్య సినిమా

ఓటీటీలో సందడి చేస్తున్న నాని, ఎస్ జె సూర్య సినిమా..

Saripodhaa Sanivaaram : ద‌స‌రా పండుగ సంద‌డి ఇంటిల్లిపాదికి ఓ వారం ముందుగానే వ‌చ్చేసింది. ఇటీవ‌ల నాని(Nani) న‌టించ‌గా రూ.100 కోట్లకు పైగా వ‌సూళ్లు సాధించిన ఫ్యామిలీ, యాక్ష‌న్ చిత్రం స‌రిపోదా శ‌నివారం(Saripodhaa Sanivaaram) తాజాగా డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది. ఆగ‌స్టు 29న థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన సినిమా పాజిటివ్ టాక్‌తో మంచి విజ‌యం సాధించి నానికి హ్యాట్రిక్ విజ‌యాన్ని అందించింది. RRR వంటి భారీ చిత్రాన్ని అందించ‌డంతో పాటు ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో ఓజీ రూపొందిస్తున్న‌ డీవీవీ దాన‌య్య ఈ సినిమాను నిర్మించ‌గా వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఎస్జే సూర్య, ప్రియాంకా మోహ‌న్, ముర‌ళీ శ‌ర్మ‌, సాయి కుమార్‌, అభిరామి ప్ర‌ధాన‌ పాత్ర‌ల్లో న‌టించారు.

Saripodhaa Sanivaaram Movie OTT Updates

క‌థ విష‌యానికి వ‌స్తే.. కళ్లెదుట చెడు జ‌రిగినా తీవ్ర ఆవేశంతో ర‌గిలిపోతూ వారిని కొట్ట‌డానికి వెళ్లిపోతుంటాడు సూర్య‌. అయితే త‌ల్లి చ‌నిపోవ‌డంతో తండ్రి, అక్క‌తో క‌లిసి ఉంటూ త‌న త‌ల్లికి ఇచ్చిన‌ చివ‌రి మాట‌ మేర‌కు కేవ‌లం శ‌నివారం మాత్ర‌మే త‌న కోపాన్ని ప్ర‌ద‌ర్శిస్తూ అందుకు కార‌ణ‌మైన వారిని కొట్టి వ‌స్తుంటాడు. ఇదిలాఉండ‌గా మ‌రోవైపు సీఐ దయానంద్ (ఎస్.జె.సూర్య) త‌న అన్న త‌న‌కు అస్తి ఇవ్వ‌డం లేద‌ని ప్ర‌స్టేష‌న్‌లో ఉంటూ ఆ కోపాన్ని స‌మీపంలోని సోకుల‌పాలెం విలేజ్‌లోని వారిపై చూపిస్తూ అక్క‌డి వారికి న‌ర‌కం చూపిస్తుంటాడు. ఈ క్ర‌మంలో సీఐ ప‌ని చేసే స్టేష‌న్‌లోని కానిస్టేబుల్ చారుల‌త వ‌ళ్ల సోకుల పాలెం విష‌యం సూర్య‌కు తెలుస్తుంది.

ఆపై సీఐని ఎదుర్కోవ‌డానికి సూర్య‌ ఏం చేశాడు, సైకో మ‌న‌స్త‌త్వం ఉన్న‌ ద‌యానంద్ ఎలా రియాక్ట్ అయ్యాడు, అసలు సోకులపాలెంకు ఉన్న స‌మ‌స్య‌ ఏమిటి? ఆ సోకులపాలెంపై దయానంద్ పగబట్టడానికి కారణమేంటి? చివరికి ఎలా సాల్వ్ చేశారు? చారులత‌కు, సూర్యకు ఉన్న బంధమేంటి? అనే క‌థ‌క‌థ‌నాల‌తో సినిమా సాగుతూ ప్రేక్ష‌కుల‌కు కావాల్సిన హాస్యాన్ని, ఎమోష‌న్‌ను అందిస్తుంది. ఈ క్ర‌మంలో వ‌చ్చే పోరాట స‌న్నివేశాలు కూడా బావుంటాయి.. ఇప్పుడు ఈ సినిమా ఈరోజు (సెప్టెంబ‌ర్, గురువారం 26) నంచి నుంచి నెట్‌ఫ్లిక్స్ లో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. సో.. థియేట‌ర్లలో ఈ సినిమాను చూడ‌లేక పోయిన‌వారు, కుటుంబంతో క‌లిసి చూడాల‌నుకునే వారు, అల్రేడీ చూసిన వారు మ‌ళ్లీ మ‌ళ్లీ ఇప్పుడు ఇంట్లోనే చూసి ఎంజాయ్ చేయ‌వ‌చ్చు.

Also Read : Jigra Trailer : అలియా నటించిన ‘జిగ్రా’ ట్రైలర్ రిలీజ్ చేసిన మేకర్స్

CinemaOTTSaripodhaa SanivaaramTrendingUpdatesViral
Comments (0)
Add Comment