Nani-Kalki : కల్కి సినిమాలో కృష్ణుడి పాత్ర పై వస్తున్న వార్తలపై స్పందించిన నాని

అందులో అతిథి పాత్ర గురించి నేను ఇప్పటి వరకు ఎవరితో చర్చించలేదు...

Nani : ‘సరిపోదా శనివారం’ సూపర్‌ సక్సెస్‌తో ఫుల్‌ జోష్‌ మీద ఉన్నారు నాని. పాన్‌ ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్‌లోనూ భారీ వసూళ్లు రాబడుతోంది. తాజాగా నాని ఓ మీడియాలోతో మాట్లాడారు. ‘ కల్కి’ సీక్వెల్లో మిమ్మల్ని కృష్ణుడిగా చూసే అవకాశం ఉందా..? అనే ప్రశ్నకు నాని ఆసక్తికర సమాధానాన్నిచ్చారు. ‘‘ అసలు లేదు.. రెండో భాగంలో కృష్ణుడి పాత్ర కంటే అర్జునుడు, కర్ణుడి పాత్రలే కీలకం కానున్నాయి. ఈ సీక్వెల్‌లో కృష్ణుడి ముఖాన్ని చూపించబోమని దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఇప్పటికే స్పష్టం చేశారు. నేను పార్ట్ 2లో ఉన్నట్లు రూమర్స్‌ ఎలా మొదలయ్యాయో తెలియడం లేదు. బహుశా నేను ఆ టీమ్‌తో కలిసి ఎక్కువసార్లు కనిపించడమే కారణం కావొచ్చు.అందులో అతిథి పాత్ర గురించి నేను ఇప్పటి వరకు ఎవరితో చర్చించలేదు. ఈ టీమ్‌తో కలిసి వర్క్‌ చేేసందుకు ఆసక్తిగా ఉన్నాను’’ అని క్లారిటీ ఇచ్చారు.

Nani Comment

జూన్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కల్కి భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో దీని సీక్వెల్‌ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల నిర్మాత మాట్లాడుతూ ూవచ్చే ఏడాది ప్రారంభంలో కల్కి పార్ట్‌2 పనులు ప్రారంభించనున్నట్లు చెప్పారు. షూటింగ్‌ మొదలుపెట్టాక దీని గురించి మరిన్ని వివరాలు పంచుకుంటామని చెప్పారు.

Also Read : Rashmika Mandanna : ప్రేక్షకులను భయపెట్టడానికి సిద్ధమవుతున్న నేషనల్ క్రష్

Hero NaniKalki 2898 ADUpdatesViral
Comments (0)
Add Comment