Nani Hi Nanna: ఓటీటీలో అదరగొడుతోన్న నాని ‘హాయ్‌ నాన్న’

ఓటీటీలో అదరగొడుతోన్న నాని ‘హాయ్‌ నాన్న’

Nani Hi Nanna: యువ దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన తాజా సినిమా ‘హాయ్‌ నాన్న(Hi Nanna)’. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై మోహన్ చెరుకూరి, విజయేంద్రరెడ్డి తీగల, మూర్తి కె ఎస్ నిర్మాతలుగా తెరకెక్కించిన ఈ సినిమా డిసెంబరు 7 ప్రపంచ వ్యాప్తంగా విడుదలై పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. తాజాగా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ వేదిగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమా టాప్‌లో కొనసాగుతూ ట్రెండింగ్‌లోకి వచ్చింది.

ఏకంగా టాప్‌ 10లో మూడు స్థానాలను సొంతం చేసుకుంది. ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో పాటు కూతురి సెంటిమెంట్ కు డిజిటల్‌ ప్రేక్షకులు కూడా ఫిదా అవుతున్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో ఐదుభాషల్లో విడుదలైన ఈ చిత్రం తెలుగులో టాప్‌ వన్‌లో ఉంది. హిందీలో 5వ స్థానం, తమిళంలో 10లో నిలిచింది. మరోవైపు ఇందులోని ఎమోషనల్‌ సీన్స్‌ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనితో నాని అభిమానులు సంబరపడుతున్నారు.

Nani Hi Nanna OTT Updates

ప్రస్తుతం నాని, డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘సరిపోదా శనివారం’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో నాని సరసన ప్రియాంక అరుళ్‌ మోహన్‌ నటిస్తుండగా ఎస్‌.జె.సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా తరువాత ‘బలగం’ వేణు దర్శకత్వంలో నాని ఓ సినిమా చేసే అవకాశముంది.

Also Read : Nayanatara: నటి నయనతారపై కేసు నమోదు !

hi nannaNatural Star Nani
Comments (0)
Add Comment