Nandamuri Balakrishna: తెలుగు చిత్ర పరిశ్రమలో చిరంజీవి, బాలకృష్ణలది ప్రత్యేక స్థానం. మాస్ హీరోలుగా వాళ్లకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కమర్షియల్ తెలుగు సినిమాకు ఒక ఊపుని తెచ్చి, బాక్సాఫీసు దగ్గర సునామీ సృష్టించిన మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ… వయసుతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. ఎన్నోసార్లు బాక్సాఫీసు దగ్గర వీరిరువురి చిత్రాలూ పోటీ పడినప్పటికీ ఎటువంటి పొరపొచ్చాలు లేకుండా, ఒకరి మీద మరొకరు ప్రత్యేక అభిమానం కురిపిస్తూ మంచి స్నేహితులుగా మెలుగుతుంటారు. ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ అనే భేదం ఈ ఇద్దరి హీరోలలోనూ లేదు.
Nandamuri Balakrishna Invitation..
వృత్తిపరమైన పోటీని సినిమాలకే పరిమితం చేసి నిజజీవితంలో ఎంతో ఎమోషనల్ బాండింగ్ కలిగి ఉంటారు చిరంజీవి, బాలకృష్ణ. ఇటీవల జరిగిన గీత రచయిత రామజోగయ్యశాస్త్రి ఇంట జరిగిన వివాహ వేడుకలో ఈ అనుబంధం మరోసారి ఆవిష్కృతమైంది. ఈ వేడుకకు చిరంజీవి, బాలకృష్ణ హాజరయ్యారు. చిరంజీవి ఎదురు పడగానే ‘బ్రదర్.. ఎలా ఉన్నారు ?’ అని ఆప్యాయంగా పలకరించారు బాలకృష్ణ. ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్న తర్వాత సెప్టెంబర్ ఒకటిన జరిగే తన సన్మాన కార్యక్రమానికి తప్పకుండా రావాలని చిరంజీవిని ఆహ్వానించారు. వస్తానని చిరంజీవి చెప్పారు. అలాగే ‘అన్‌స్టాపబుల్’ కార్యక్రమం గురించి కూడా వీరిద్దరి మధ్య సంభాషణ జరిగిందని సమాచారం.
Also Read : Ramajogaiah Sastry: పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి కుమారుడి పెళ్లిలో సెలబ్రెటీల సందడి !