Nandamuri Balakrishna: వేటకు దిగిన సింహం ! ‘NBK 109’ ఫస్ట్ గ్లింఫ్స్ రిలీజ్ !

వేటకు దిగిన సింహం ! 'NBK 109' ఫస్ట్ గ్లింఫ్స్ రిలీజ్ !

Nandamuri Balakrishna: యువ దర్శకుడు బాబీ కొల్లి (కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో నందమూరి నటసింహం బాలకృష్ణ(Nandamuri Balakrishna) హీరోగా తెరకెక్కిస్తున్న తాజా సినిమా ‘NBK 109’. ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌, సితార ఎంటర్ టైన్ మెంట్ సంయుక్త బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్, మలయాళ స్టార్ హీరో దల్కర్ సల్మాన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గతంలో విడుదల చేసిన ‘బ్లడ్ బాత్ కా బ్రాండ్ నేమ్, వయలెన్స్ కా విజిటింగ్ కార్డ్’ అంటూ మారణాయుధాలు, మందు బాటిల్స్ ఉన్న కూడిన పోస్టర్ కు మంచి స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో మహా శివరాత్రి సందర్బంగా చిత్ర యూనిట్ ఫస్ట్ గ్లింఫ్స్ ను విడుదల చేసారు. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

Nandamuri Balakrishna Movie Updates

మహాశివరాత్రి సందర్భంగా శుక్రవారం విడుదల చేసిన పోస్టర్ లో బాలకృష్ణ చేసిన హంగామా సినిమాపై మరిన్ని అంచనాల్ని పెంచింది. ‘ఏంట్రా…వార్‌ డిక్లేర్‌ చేస్తున్నావా ?’ అని ప్రశ్నించగా… ‘సింహం నక్కలమీదకు వస్తే వార్‌ అవ్వదు… ఇట్స్‌ కాల్డ్‌ హంటింగ్‌’ అంటూ బాలకృష్ణ ప్రతినాయకుల్ని వేటాడే సన్నివేశాలు అందులో ఉన్నాయి. శక్తిమంతమైన పోరాట ఘట్టంలో బాలకృష్ణ ఉన్న ఫస్ట్ గ్లింఫ్స్… యాక్షన్ ప్రియులకు ఐ ఫీస్ట్ గా మారింది.

Also Read : Sai Dharam Tej: పేరు మార్చుకున్న మెగా హీరో !

Bobby DeolDirector BobbyNandamuri BalakrishnaNBK109
Comments (0)
Add Comment