Nandamuri Balakrishna: బాలకృష‍్ణ 50 ఏళ్ళ నటజీవితం పోస్టర్ ఆవిష్కరణ !

బాలకృష‍్ణ 50 ఏళ్ళ నటజీవితం పోస్టర్ ఆవిష్కరణ !

Nandamuri Balakrishna: నందమూరి నటసింహాం నందమూరి బాలకృష్ణ సినీ ప్రయాణానికి యాభై ఏళ్ళు పూర్తవుతున్నాయి. దివంగత నందమూరి తారక రామారావు వారసుడిగా ‘తాతమ్మకల’ సినిమాతో 1974లో బాల నటుడిగా తన నటనా ప్రస్థానాన్ని ప్రారంభించిన బాలకృష్ణ… అగ్ర కథా నాయకుడిగా టాలీవుడ్ లో, హిందూపురం ఎమ్మెల్యేగా రాజకీయా, బసవతారకం హాస్పిటల్ చైర్మన్ గా సేవా రంగంలో తనదైన ముద్ర వేసుకున్నారు. బాల నటుడిగా బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన ‘తాతమ్మకల’విడుదలై ఈ ఆగస్టు 30 నాటికి యాభై ఏళ్ళు అవుతోంది. ఈ క్రమంలో బాలకృష్ణ 50 ఏళ్ల నటజీవితం పూర్తి చేసుకున్న సందర్భంగా సెప్టెంబరు 1న హైదరాబాద్ లో పెద్ద ఎత్తున సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ సన్మాన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ కమ్ కర్టన్ రైజర్ కార్యక్రమాన్ని బుధవారం హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నందమూరి రామకృష్ణ, నందమూరి మోహనకృష్ణలు కలిసి స్వర్ణోత్సవం పోస్టర్‌ను ఆవిష్కరించారు.

Nandamuri Balakrishna Movies..

ఈ కార్యక్రమంలో దర్శక,నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజా మాట్లాడుతూ… ‘బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్నప్పటికీ, ఇప్పటి యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా పోటీ ఇస్తున్నారు. ఇండియన్ సినిమాలో అమితాబ్ తర్వాత బాలకృష్ణలాగా నటించిన వాళ్లు ఎవరూ లేరు. బాలయ్య స్కూలు వెళ్లేటప్పటి నుంచి ఇప్పుడు కూడా ఒక సామాన్యుడిలా తిరుగుతారు. చాలా సింప్లిసిటీగా ఉంటారు. బాలయ్య(Nandamuri Balakrishna) నాకు ఇష్టమైన నటుడు. ఆయన 50 వసంతాలు పూర్తి చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇండస్ట్రీ అంతా కలిసి చేస్తున్న ఈ కార్యక్రమానికి అందరూ వచ్చి విజయవంతం చేయాలి’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్, నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు, సీనియర్ డైరెక్టర్ కోదండరామిరెడ్డి, మాదాలరవి, నటుడు శివబాలాజీ, దామోదర్ ప్రసాద్, భరత్ భూషణ్, వైవీఎస్ చౌదరి, సీ కల్యాణ్, పరుచూరి గోపాలకృష్ణ, తుమ్మల ప్రసన్నకుమార్ పాల్గొన్నారు.

ప్రస్తుతం బాలకృష్ణ కథానాయకుడిగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మాతలు. బాలీవుడ్‌ నటుడు బాబీ దేవోల్‌ ప్రతినాయకుడి పాత్రని పోషిస్తున్నారు. ఇది బాలకృష్ణ 109వ చిత్రం. యాక్షన్‌ ప్రధానంగా రూపొందుతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా విజయ్‌ కార్తీక్‌ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.

Also Read : Unstoppable 4 : త్వరలో అన్‌స్టాపబుల్ సీజన్ 4 తో వస్తున్న బాలకృష్ణ

Nandamuri BalakrishnaNBK109
Comments (0)
Add Comment