Nandamuri Balakrishna: ఆకట్టుకుంటోన్న బాలకృష్ణ 50 ఏళ్ల సినీ ప్రయాణ వేడుకల ఆహ్వాన పత్రిక !

ఆకట్టుకుంటోన్న బాలకృష్ణ 50 ఏళ్ల సినీ ప్రయాణ వేడుకల ఆహ్వాన పత్రిక !

Nandamuri Balakrishna: నందమూరి నటసింహాం నందమూరి బాలకృష్ణ సినీ ప్రయాణానికి యాభై ఏళ్ళు పూర్తవుతున్నాయి. దివంగత నందమూరి తారక రామారావు వారసుడిగా ‘తాతమ్మకల’ సినిమాతో 1974లో బాల నటుడిగా తన నటనా ప్రస్థానాన్ని ప్రారంభించిన బాలకృష్ణ(Nandamuri Balakrishna)… అగ్ర కథా నాయకుడిగా టాలీవుడ్ లో, హిందూపురం ఎమ్మెల్యేగా రాజకీయా, బసవతారకం హాస్పిటల్ చైర్మన్ గా సేవా రంగంలో తనదైన ముద్ర వేసుకున్నారు. బాల నటుడిగా బాలకృష్ణ నటించిన ‘తాతమ్మకల’విడుదలై ఈ ఆగస్టు 30 నాటికి యాభై ఏళ్ళు అవుతోంది. ఈ క్ర‌మంలో తెలుగు చలన చిత్ర వాణిజ్యమండలి కార్యదర్శి కె.ఎల్‌.దామోదర్‌ ప్రసాద్, అధ్యక్షుడు సునీల్‌ నారంగ్, తెలుగు సినీ నిర్మాతల మండలి కార్యదర్శి టి.ప్రసన్నకుమార్, తెలుగు సినీ కార్మిక సమాఖ్య అధ్యక్షుడు వల్లభనేని అనిల్‌ ఇటీవల బాలకృష్ణని కలిసి, సన్మాన వేడుకు అంగీకరించాల‌ని కోర‌గా అందుకు ఆయన గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఈ నేస‌థ్యంలో సెప్టెంబ‌ర్ 1న సాయంత్రం హైద‌రాబాద్‌ లో అంగ‌రంగ వైభ‌వంగా ఈ ఉత్స‌వం నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.

Nandamuri Balakrishna Movie Updates

ఈ సన్మాన వేడుకకు దేశ వ్యాప్తంగా అన్ని సినిమా ఇండ‌స్ట్రీలు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులను ఈ వేడుక‌కు ఆహ్విస్తున్నారు. ఈ నేపథ్యంలో బాల‌కృష్ణ(Nandamuri Balakrishna) సినిమా రంగానికి చేసిన‌, చేస్తున్న సేవ‌ల‌ను ప్ర‌స్తావిస్తూ ఓ ఆహ్వాన పత్రికను రూపొందించి విడుదల చేశారు. ఇందులో బాల‌కృష్ణ సినిమాల ప‌రంగా సాధించిన రికార్డుల‌ను, రాజ‌కీయాల్లో, సామాజిక కార్య‌మాల్లో ఆయ‌న చేస్తున్న‌ సేవ‌ల‌ను పొందుప‌రిచారు.సెప్టెంబరు 1వ తేదీ సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లో ఈ వేడుక ప్రారంభంకానుంది. 50ఏళ్ల సినీ ప్రయాణంలో బాలకృష్ణ 109 సినిమాల్లో కథానాయకుడిగా నటించారు. ఆయన సరసన 129 మంది హీరోయిన్స్‌ ఆడిపాడారు. భారతీయ నటుల్లో అత్యధిక మంది హీరోయిన్స్‌తో కలిసి నటించిన వ్యక్తిగా ఆయనకు రికార్డు ఉంది. సోషల్, మైథలాజికల్‌, హిస్టారికల్‌, బయోపిక్, సైన్స్‌ ఫిక్షన్‌ ఇలా అన్ని జానర్స్‌లో నటించిన రికార్డు బాలయ్యకు ఉంది. ఇప్పుడు ఈ ఆహ్వాన ప‌త్రిక సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతోంది.

ప్రస్తుతం బాలకృష్ణ కథానాయకుడిగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మాతలు. బాలీవుడ్‌ నటుడు బాబీ దేవోల్‌ ప్రతినాయకుడి పాత్రని పోషిస్తున్నారు. ఇది బాలకృష్ణ 109వ చిత్రం. యాక్షన్‌ ప్రధానంగా రూపొందుతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా విజయ్‌ కార్తీక్‌ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.

Also Read : Gul Renjith Chandran: తమిళంలో నటుడిగా మారిన మలయాళ సింగర్‌ గుల్‌ రంజిత్ !

Basavatarakam Indo American Cancer Hospital & Research InstituteNandamuri BalakrishnaNBK109
Comments (0)
Add Comment