Bigg Boss Telugu : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 మరో వారం రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ సారి బిగ్ బాస్ హౌస్ లోనికి ఎంట్రీ ఇచ్చే సెలబ్రెటీల గురించి తీవ్రంగా చర్చ జరుగుతోంది. సింగర్, మోడల్, డ్యాన్సర్, యాక్టర్.. ఇలా విభిన్న రంగాల నుంచి కంటెస్టెంట్ల ఎంపిక చేపట్టారు. ఇప్పటికే రీతూ చౌదరి, విష్ణుప్రియ, సౌమ్య రావు, ఏక్ నాథ్ హారిక, యష్మి గౌడ, అంజలి పవన్, యాంకర్ శేఖర్ భాషా, యాదమ్మరాజు దాదాపు ఖరారయ్యారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ కు చెందిన ఓ హీరోయిన్, బుల్లితెర డ్యాన్స్ షోలకు చెందిన ఓ డ్యాన్సర్ కూడా ఈ సారి బిగ్ బాస్(Bigg Boss Telugu) హౌస్ లోనికి అడుగుపెడుతున్నారనే ప్రచారం జరుగుతోంది.
Bigg Boss Telugu Season 8 Updates
తాజాగా ఓ డ్యాన్సర్ పేరు తెరపైకి వచ్చింది. తనే నైనిక. డ్యాన్స్ రియాలిటీ షో ఢీలో పాల్గొని తన టాలెంట్ చూపించింది. ఈవిడ అచ్చ తెలుగమ్మాయి. అలాగే ఓ మలయాళ హీరోయిన్ సైతం షోలోకి వచ్చేస్తోందట.. తనే విస్మయ శ్రీ. చూడటానికి క్యూట్‌గా కనిపించే ఈ బ్యూటీ… తెలుగులో మైల్స్ ఆఫ్ లవ్, కృష్ణగాడు అంటే ఒక రేంజ్, నమో, దిల్‌సే చిత్రాల్లో నటించింది. ఇన్ని సినిమాలు చేసినా విస్మయకు టాలీవుడ్‌లో అంతగా గుర్తింపు రావడం లేదు. ఇంతలో బిగ్‌బాస్ ఆఫర్ వచ్చింది. దీనివల్ల జనాలకు మరింత దగ్గరవచ్చని భావించిందో ఏమో కానీ వెంటనే ఆఫర్ ఓకే చేసిందట. మరి ఈ బ్యూటీస్ షోలో ఏమేరకు మెప్పిస్తారో చూడాలి!
Also Read : Namitha: మధుర మీనాక్షి దేవాలయ సిబ్బందిపై బొద్దుగుమ్మ నమిత అసహనం !