Kubera Movie : నాగ్, ధనుష్ మల్టీస్టారర్ గా శేఖర్ కమ్ముల సినిమాకు టైటిల్ ఖరారు

అంతకుముందు మహాశివరాత్రి సందర్భంగా విడుదల చేస్తానన్న త్రిశూల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకోగా

Kubera Movie : శేఖర్ కమ్ముల అన్నిరకాల ప్రేక్షకులను మెప్పించే గొప్ప చిత్రాలను రూపొందించడంలో పేరుగాంచిన తెలివైన దర్శకుడు. ప్రస్తుతం తమిళ స్టార్ హీరో ధనుష్, కింగ్ నాగార్జునతో మల్టీ స్టారర్ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీ నారాయణ్ దాస్ కె. నారంగ్ ఆశీస్సులతో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి (ఏషియన్ గ్రూప్ యూనిట్) బ్యానర్‌పై సునీల్ నారంగ్, పుష్కర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. మహాశివరాత్రి సందర్భంగా ఈ సినిమా టైటిల్‌తో కూడిన ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘కుబేర’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.

Kubera Movie Updates

అంతకుముందు మహాశివరాత్రి సందర్భంగా విడుదల చేస్తానన్న త్రిశూల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకోగా.. ఇప్పుడు టైటిల్ లుక్‌ని విడుదల చేయడంలో కాస్త ఆలస్యమవుతోందని మేకర్స్ ప్రకటించారు. టైటిల్ చూస్తుంటే ఈ ఇద్దరు కథానాయకులతో శేఖర్ కమ్ముల(Sekhar Kammula) ఓ వినూత్న సినిమా చేస్తున్నాడని చెప్పొచ్చు. ఎందుకంటే శేఖర్ కమ్ముల సినిమా టైటిల్‌కు తగ్గ దర్శకుడు. కానీ ‘కుబేర’ టైటిల్ వినగానే ఇదొక మాస్ సినిమాలా అనిపిస్తుంది. మరి శేఖర్ కమ్ముల ఈ సినిమాను ఎలా తీస్తాడు అనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్‌డేట్‌లు త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది. రష్మిక మందన కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Also Read : Kannappa Movie : నెట్టింట వైరల్ అవుతున్న ‘కన్నప్ప’ ఫస్ట్ లుక్

Combinationdhanushking nagarjunaMoviesekhar kammulaTrendingUpdatesViral
Comments (0)
Add Comment