Nagarjuna : మన్మథుడు అక్కినేని నాగార్జున డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కలిసి మరో సినిమా చేయబోతున్నారా. అవుననే సమాధానం వస్తోంది సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్. ఈ ఇద్దరు కలిసి గతంలో సక్సెస్ ఫుల్ సినిమా తీశారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత నాగ్(Nagarjuna), పూరీ కాంబో ప్రారంభం కానుందని టాక్. ఈ ఇద్దరూ కలిసి అనుష్క శెట్టితో కలిసి 2005 సంవత్సరంలో సూపర్ సినిమా వచ్చింది. మంచి సక్సెస్ అయ్యింది. ఈ చిత్రం కంటే ముందు ఇద్దరూ కలిసి శివమణి వచ్చింది. ఇది 2003లో రిలీజ్ అయ్యింది.
Nagarjuna – Puri Jagannath Combination
ఇదిలా ఉండగా తాజా సమాచారం మేరకు నాగార్జున అక్కినేనితో తీయబోయే సినిమా గురించి తన తనయుడు అఖిల్ అక్కినేనితో పూరీ విస్తృతంగా చర్చలు కూడా జరుపుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే కథ గురించి, వీరిద్దరూ కలిసి చర్చించిన విషయం గురించి నాగార్జున, పూరీ జగన్నాథ్ ఇంకా ధ్రువీకరించ లేదు.
ప్రస్తుతం అక్కినేని నాగార్జున బిగ్ బాస్ హోస్ట్ గా ఉన్నారు. ఇక రాబోయే ప్రాజెక్టులలో కుబేర , కూలీ చిత్రంలో అతిథి పాత్రలలో కనిపించ బోతున్నాడు. మరో వైపు తమిళ సినీ దర్శకుడితో నాగ్ పాన్ ఇండియా సినిమా చేస్తున్నట్లు వినికిడి. మరో వైపు పూరీ జగన్నాథ్ తను తీసిన ఇటీవలి మూవీస్ ఆశించిన మేర ఆడలేదు. బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో తన వైపు ఎవరూ చూడడం లేదు. దేవరకొండ విజయ్ తో తీసిన లైగర్ బిగ్ లాస్ గా మిగిలింది.
Also Read : Hero Rajinikanth Coolie vs War 2 :ఆగస్టులో కూలీ వర్సెస్ వార్ 2