Hero Rajin Raj-Nagarjuna :రాగిన్ రాజ్ కు మంచి భ‌విష్య‌త్తు ఉంది

త‌ల మూవీ టికెట్ కొనుగోలు చేసిన నాగ్

Nagarjuna : కొత్త వాళ్లను ప్రోత్స‌హించ‌డంలో ఎల్ల‌ప్పుడూ ముందుంటారు ప్ర‌ముఖ న‌టుడు, యాంక‌ర్ అక్కినేని నాగార్జున‌. ఆయ‌న తాజాగా ద‌ర్శ‌కుడు అమ్మ రాజ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిన్న సినిమా త‌ల మూవీకి సంబంధించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఇందులో అమ్మ రాజ‌శేఖ‌ర్ త‌న‌యుడు తొలిసారిగా రాగిన్ రాజ్ న‌టిస్తున్నాడు. ఈ సంద‌ర్బంగా త‌న‌కు మంచి భ‌విష్య‌త్తు ఉంద‌ని పేర్కొన్నారు నాగ్(Nagarjuna). అంతే కాదు ఈ సినిమాకు తాను పూర్తిగా మ‌ద్ద‌తు ఇస్తున్నాన‌ని ప్ర‌క‌టించాడు.

Nagarjuna Praises

వెంట‌నే త‌ల చిత్రానికి గాను బుక్ మై షోలో టికెట్ కూడా కొనుగోలు చేశాడు. ద‌ర్శ‌కుడు అమ్మ రాజ‌శేఖ‌ర్ తో పాటు చిత్ర బృందంతో క‌లిసి నాగార్జున త‌ల మూవీని చూశారు. ట్రైల‌ర్ ను చూసి అద్భుతంగా ఉందంటూ కితాబు ఇచ్చాడు.

మేకింగ్, టేకింగ్ బాగుంద‌ని, త‌ల చిత్రం త‌ప్ప‌కుండా విజ‌యం సాధిస్తుంద‌ని ఆ న‌మ్మ‌కం త‌న‌కు ఉంద‌న్నాడు అక్కినేని నాగార్జున‌. రాగిన్ రాజ్ పెద్ద న‌టుడు కావాల‌ని ఆశీర్వ‌దించారు. అమ్మ రాజ‌శేఖ‌ర్ నిబ‌ద్ద‌త క‌లిగిన ద‌ర్శ‌కుడ‌ని, త‌న‌కు సినిమాలే లోక‌మ‌ని, ఎక్క‌డా ఎవ‌రికీ క‌నిపించ‌కుండా త‌న ప‌ని తాను చేసుకుంటూ పోతాడ‌ని పేర్కొన్నాడు నాగ్.

ఈ సంద‌ర్బంగా అమ్మ రాజ‌శేఖర్ స్పందిస్తూ త‌మ ప‌ట్ల అభిమానం కురిపించ‌డ‌మే కాదు త‌ల చిన్న చిత్రానికి సంపూర్ణంగా మ‌ద్ద‌తు ఇస్తున్నందుకు అక్కినేని నాగార్జున‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు.

Also Read : సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ ‘శారీ’ రెడీ

akkineni nagarjunaCommentsPraisesViral
Comments (0)
Add Comment