Dhanush : అక్కినేని నాగార్జున, తమిళ సినీ నటుడు ధనుష్ కలిసి నటించిన కుబేర(Kubera) సినిమా ఆఖరి దశలో ఉంది. ఇప్పటికే సినిమాకు చెందిన పోస్టర్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. తాజాగా కీలక అప్ డేట్ వచ్చింది. కుబేర మూవీని ఈ ఏడాది జూన్ నెల 20న విడుదల చేయనున్నట్లుల ప్రకటించారు మూవీ మేకర్స్. దీనిని నేచురల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తీస్తుండడం విశేషం.
Dhanush Kubera Movie Updates
కుబేరను శ్రీ వేంకటేశ్వర సినిమాస్ తీస్తోంది. శక్తి కథ, సంపద కోసం యుద్దం, విధి ఆట. మీ ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతోంది అంటూ ఎక్స్ వేదికగా పంచుకుంది. మహా శివ రాత్రిని పురస్కరించుకుని కీలక ప్రకటన చేయడం విశేషం. ధనుష్ కు శివుడంటే ఇష్టం. అంతకు మించిన భక్తి కూడా. ఆయన తిరుమలను ప్రతి సారి దర్శించుకుంటారు.
నాగార్జున, ధనుష్ లు కలిసి తొలిసారి నటించడం ఈ చిత్రం ద్వారా. గతంలో తమిళ సినీ నటుడు కార్తీతో కలిసి మనం సినిమా లో నటించాడు. ఈ చిత్రంలో జిమ్ సర్భ్, రష్మిక మందన్న కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నటుడు ధనుష్ ప్రముఖ చిత్ర దర్శకుడు ,నిర్మాత శేఖర్ కమ్ములతో చేతులు కలపడం ఇదే మొదటిసారి .
ఇదిలా ఉండగా ఈ కుబేర సినిమాలో ధనుష్ ఓ బిచ్చగాడి పాత్రను పోషిస్తున్నాడని, ఆ తర్వాత మాఫియా రాజుగా ఎదుగుతాడని , నాగర్జున దర్యాప్తు అధికారి పాత్రలో నటిస్తున్నట్లుల సమాచారం.
Also Read : Beauty Sreeleela :శ్రీలీల ఆస్కార్ డ్రీమ్స్ వీడియో అదుర్స్