Nagarjuna Akkineni: రజనీ ‘తలైవా 171’ లో కింగ్ నాగార్జున ?

రజనీ ‘తలైవా 171’ లో కింగ్ నాగార్జున ?

Nagarjuna Akkineni: సూపర్ స్టార్ రజనీకాంత్… కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్… తో ఓ సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ‘తలైవా171’ (వర్కింగ్ టైటిల్) గా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ‘తలైవా 171’ చిత్రానికి అనిరుధ్‌ సంగీతం అందించనుండగా… ఇందులో శివకార్తికేయన్‌ కీలక పాత్రలో నటించనున్నారు. ఈ సినిమాలో రజనీకాంత్ సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తారనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న దర్శకుడు లోకేశ్ కనగరాజ్… టైటిల్ రిలీజ్ టీజర్ ను ఏప్రిల్ 22న విడుదల చేయడంతో పాటు సినిమా షూటింగ్ ను జూన్ నుండి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.

Nagarjuna Akkineni in Thalaiva Movie

అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇప్పుడు సోషల్ మీడియాను కుదిపేస్తుంది. రజనీకాంత్-లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున(Nagarjuna Akkineni) అక్కినేని ఓ ముఖ్య పాత్రలో కనిపిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దీనికి ఇటీవల దర్శకుడు లోకేష్ కనగరాజ్… కింగ్ నాగార్జున ఇంటికి వెళ్ళడం ఆ ప్రచారానికి మరింత బలం చేకూర్చుతోంది. అలాగే ఈ సినిమాలో రజనీకాంత్‌కి కూతురు పాత్ర కోసం శ్రుతిహాసన్‌ ఎంపికైనట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయాలపై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. నాగార్జున(Nagarjuna Akkineni) ఇప్పటికే ధనుష్‌ తో కలిసి శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ‘కుబేర’ చిత్రంలో నటిస్తున్నారు.

విక్రమ్‌ సినిమాతో నటుడు కమలహాసన్‌ కు సంచలన విజయాన్ని అందించిన లోకేశ్‌కనకరాజ్‌… ఇప్పుడు రజనీకాంత్‌ను చాలా డిఫరెంట్‌గా చూపించడానికి ప్రయత్నిస్తున్నారు. దీనితో విజయ్-లోకేశ్, విజయ్-కార్తీ, విజయ్-కమల్ కాంబినేషన్లు చూసిన అభిమానులు విజయ్-రజనీ కాంబినేషన్ కోసం ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రజనీకాంత్… ‘జై భీమ్’ సినిమా ఫేం టి.జి.జ్ఞానవేల్‌ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘వెట్టయాన్‌’ (తెలుగులో ‘వేటగాడు’) లో నటిస్తున్నారు. ఇందులో అమితాబ్‌, ఫహద్‌ ఫాజిల్‌, రానా, మంజు వారియర్‌, రితికాసింగ్‌, దుషారా విజయన్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు.

Also Read : Amitabh Bachchan: ‘కల్కి 2898 ఏడీ’ లో అశ్వత్థామగా అమితాబ్‌ ఫస్ట్ లుక్ అదుర్స్ !

akkineni nagarjunaSuper Star Rajanikanththalaivar 171
Comments (0)
Add Comment