Naga Chaitanya : మనసు పిండేసేలా డైలాగ్ అదరగొట్టిన చెయ్..వైరలవుతున్న వీడియో

అయితే నాగ చైతన్య వ్యక్తిగత జీవితం గురించి అందరికీ తెలిసిందే

Naga Chaitanya : అక్కినేని ఫ్యామిలీలో నాగార్జున వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు నాగ చైతన్య. జోష్ సినిమాతో హీరోగా పరిచయమైన నాగ చైతన్య మొదటి సినిమాతోనే యూత్ కి బాగా దగ్గరయ్యాడు. ఆ తర్వాత భారీ హిట్‌గా నిలిచిన ‘ఎమ్ మాయ చేసావే’ సినిమాతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు ఈ యంగ్ హీరో. హిట్లు, పరాజయాలు అనే తేడా లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు నాగ్ చైతన్య. తక్కువ సినిమాలు చేసినా. నాగ చైతన్య విభిన్న పాత్రలు పోషించి ప్రేక్షకులను అలరించాడు. ‘మజిలి’, ‘లవ్‌స్టోరీ’ వంటి చిత్రాల్లో తన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. తాజాగా నాగ చైతన్య దూత అనే వెబ్ సిరీస్‌లో కూడా నటించాడు. ప్రస్తుతం ‘తండేల్’ సినిమాతో బిజీగా ఉన్నాడు ఈ యంగ్ హీరో.

Naga Chaitanya Video Viral

అయితే నాగ చైతన్య వ్యక్తిగత జీవితం గురించి అందరికీ తెలిసిందే. నాగ చైతన్య స్టార్ హీరోయిన్ సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. టాలీవుడ్ హ్యాండ్సమ్ కపుల్ గా పేరొందిన ఈ జంట సడన్ బ్రేకప్ తో అభిమానులకు షాక్ ఇచ్చారు. కారణం తెలియనప్పటికీ, వారి విడిపోవడం అభిమానులలో పెద్ద షాక్‌కు కారణమైంది. సమంత ఆ తర్వాత మైయోసైటిస్‌తో బాధపడింది, ఇది ఆమె చలనచిత్ర ప్రదర్శనలలో గ్యాప్‌కు దారితీసింది.

నాగ చైతన్య చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. కాగా, నాగ చైత్యకు(Naga Chaitanya) సంబంధించిన ఓ ఎమోషనల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలోని నాగ్ చైతన్య మాటలు మనసుకు హత్తుకునేలా ఉన్నాయి. ఈ వీడియోలో నాగ చైతన్య మాట్లాడుతూ “గాయపడిన మనసు మనిషిని ఎంతదూరమైనా తీసుకువెళుతుంది. ఈ అనుభూతిని అందరూ అర్థం చేసుకోగలరు. స్నేహితుడికి లేదా కుటుంబ సభ్యునికి ఏదైనా జరిగినా, మనలోని ఫైర్ వేరుగా ఉంటుంది. ఈ సమయంలో రియాక్ట్ అయితే చాలా వయలెంట్ గా రియాక్ట్ అవుతాం” అని నాగ చైతన్య అన్నారు.మనసుకు హత్తుకునే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Also Read : Tillu Square : వైరాలవుతున్న సిద్ధు, అనుపమ కలిసి నటించిన ‘టిల్లు స్క్వేర్’ ట్రైలర్

Naga ChaitanyaTrendingUpdatesViral
Comments (0)
Add Comment