Naga Chaitanya-Sobhita : నాగ చైతన్య, శోభితల పెళ్లి పనులు షురూ

సమంతతో విడిపోయిన తర్వాత నాగచైతన్య సింగిల్‌గానే ఉన్నారు...

Naga Chaitanya : అక్కినేని నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల త్వరలో పెళ్లి పీటలెక్కనున్న విషయం తెలిసిందే. ఇటీవల వీరి నిశ్చితార్థం వేడుకగా జరిగింది. తాజాగా పెళ్లి పనులు మొదలయ్యాయి. పసుపు దంచుతున్న ఫొటోలను శోభితా(Sobhita) తన ఇన్‌స్టా ఖాతాలో షేర్‌ చేశారు. ‘ గోధుమరాయి పసుపు దంచడంతో పనులు ప్రారంభమయ్యాయి’ అని క్యాప్షన్‌ పెట్టారు. ఎరుపు రంగు పట్టు చీరలో శోభిత సంప్రదాయబద్దంగా మెరిసిపోతూ కనిపించారు. ప్రస్తుతం ఆ ఫొటోలు వైరల్‌గా మారాయి. పెళ్లి ఎక్కడ, ఎప్పుడో అనేది ఇంకా వెల్లడించలేదు. ఈ ఫొటోలు చూసిన అభిమానులు అదే ప్రశ్న అడుగుతున్నారు.

Naga Chaitanya-Sobhita Marriage Updates

సమంతతో విడిపోయిన తర్వాత నాగచైతన్య సింగిల్‌గానే ఉన్నారు. ఆ తరవాత కథానాయిక శోభితతో ప్రేమలో పడ్డాడని, ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలొచ్చాయి. వీటిపై అక్కినేని ఫ్యామిలీ ఎక్కడా స్పందించలేదు. ఆగస్ట్‌ 8న నిశితార్థ వేడుక చేసి అందరికీ షాక్‌ ఇచ్చారు. తమ కుటుంబంలోకి శోభితని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నట్టు నాగార్జున ప్రకటించారు. శోభిత ఇంట్లో పెళ్లి పనులు మొదలైనట్లు తెలుస్తుంది కానీ.. అక్కినేని కుటుంబం నుంచి పెళ్లికి సంబంధించిన ఎలాంటి వార్తా బయటకు రాలేదు. ఈ నెలలోనే పెళ్లి జరగబోతోందని, పెళ్లి వేడుక నిరాడంబరంగా ఉంటుందని సమీప బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరవుతారని తెలుస్తోంది.

Also Read : Kangana Ranaut : మరోసారి హాట్ కామెంట్స్ చేసిన లేడీ డాన్ ‘కంగనా రనౌత్’

marriageNaga ChaitanyaSobhita DhulipalaTrendingUpdatesViral
Comments (0)
Add Comment