Naga Chaitanya: రాజస్థాన్ వేదికగా మార్చిలో ఏడడుగులు వేయనున్న చే-శోభిత ?

రాజస్థాన్ వేదికగా మార్చిలో ఏడడుగులు వేయనున్న చే-శోభిత ?

Naga Chaitanya: హీరో నాగచైతన్య, హీరోయిన్‌ శోభితా ధూళిపాళ్లల నిశ్చితార్థం ఈ నెల 8న జరిగిన విషయం తెలిసిందే. అప్పట్నుంచీ వీరి వివాహం ఎక్కడ జరుగుతుంది ? ఎప్పుడు జరుగుతుంది ? అనే చర్చ ప్రారంభమైంది. కాగా నాగచైతన్య, శోభితల వివాహం ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది మార్చిలో రాజస్థాన్‌లో జరిగే అవకాశం ఉందనే టాక్‌ ప్రచారంలోకి వచ్చింది. ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘తండేల్‌’ సినిమాతో బిజీగా ఉన్న నాగ చైతన్య(Naga Chaitanya)… పలు బాలీవుడ్ ప్రాజెక్టుల్లో నిమగ్నమైన శోభిత కు షూటింగ్ నుండి విరామ సమయం దొరికినపుడు పెళ్లి పీటలెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది మార్చిలో వీరిద్దరి వివాహానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Naga Chaitanya Marriage Updates

ఈ ఇద్దరి సినిమా కాల్షీట్స్, వీరి కుటుంబంలోని ముఖ్య సభ్యులు అందుబాటులో ఉండే సమయం వంటి అంశాలు చర్చించుకుని పెళ్లి తేదీ, వివాహ వేదికపై ఇద్దరి కుటుంబ సభ్యులు ఓ స్పష్టతకు వస్తారట. మరి… ఈ ఏడాది చివర్లో నాగచైతన్యతో శోభిత ఏడడుగులు వేస్తారా ? లేక వచ్చే ఏడాది మార్చిలో శోభిత మెడలో చైతన్య మూడు ముళ్లు వేస్తారా ? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు. ఇక ప్రస్తుతం నాగచైతన్య ‘తండేల్‌’ సినిమాతో బిజీగా ఉన్నారు. సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు చందు మొండేటి దర్శకుడు.

Also Read : Tamannaah Bhatia: మిల్క్ బ్యూటీ తమన్నా కేసును వాయిదా వేసిన చెన్నై హైకోర్టు !

Akkineni Naga ChaitanyaNaga ChaitanyaSobhita Dhulipala
Comments (0)
Add Comment