Hero Naga Chaitanya: ‘తండేల్‌’ కు శ్రీకారం చుట్టిన నాగచైతన్య

‘తండేల్‌’ కు శ్రీకారం చుట్టిన నాగచైతన్య

Naga Chaitanya: ‘ప్రేమమ్‌’, ‘సవ్యసాచి’ చిత్రాల తర్వాత నాగచైతన్య- చందూ మొండేటి కాంబినేషన్‌లో రూపొందునున్న తాజా సినిమా ‘తండేల్‌’. గీతా ఆర్ట్స్‌ పతాకంపై బన్నీ వాస్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో నాగచైతన్య సరసన సాయిపల్లవి నటిస్తున్నారు. ఉత్తరాంధ్రా జిల్లాలకు చెందిన మత్సకారులు చేపల వేటకు వెళ్లి… పాకిస్తాన్ జైల్ లో బందీలుగా మారిన యథార్ధ కథ ఆధారంగా రూపొందిస్తున్న ఈ సినిమాకు సంబంధించి గత ఏడాదిన్నరగా రీసెర్చ్ చేసిన చిత్ర యూనిట్ ఇటీవల శ్రీకాకుళం జిల్లాలోని మత్సకార గ్రామం వెళ్ళి వారి జీవన స్థితి గతులను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా తనకు చాలా ప్రత్యేకం అంటూ హీరో నాగచైతన్య పలుమార్లు వెల్లడించారు.

Naga Chaitanya Movie Updates

గత ఏడాదిన్నరగా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నన చిత్ర యూనిట్ ఎట్టకేలకు శనివారం ఈ ‘తండేల్‌’ సినిమా షూటింగ్ ను పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి హీరో విక్టరీ వెంకటేశ్‌ క్లాప్‌ కొట్టగా… నాగార్జున కెమెరా స్విచ్చాన్‌ చేశారు. అల్లు అరవింద్‌ స్క్రిప్ట్‌ను దర్శకుడికి అందించారు. ఈ పూజా కార్యక్రమంలో సాయిపల్లవి, షామ్‌ దత్‌, నాగేంద్ర, నవీన్‌ యెర్నేని, సునీల్‌ నారంగ్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో నాగచైతన్య(Naga Chaitanya) మాట్లాడుతూ.. ‘‘ఏడాదిన్నరగా ఈ కథతో ప్రయాణం చేస్తున్నా. ప్రీప్రొడక్షన్‌లో ప్రతి అడుగును చాలా ఆస్వాదించా. శ్రీకాకుళం వెళ్లి మత్స్యకార కుటుంబాల్ని కలవడం.. నేను, చందూ కథపై చర్చించడం.. శ్రీకాకుళం యాసపై వర్కవుట్‌ చేయడం.. ఇలా చాలా విషయాలపై ప్రత్యేక దృష్టితో పని చేశాం. ఏ సినిమాకి ఇంత ప్రణాళికతో ముందుకు వెళ్లలేదు. ఇది ప్రతి సినిమాలా కాదు. చాలా ప్రత్యేకమైంది. డిసెంబరు 15 తర్వాత నుంచి చిత్రీకరణ ప్రారంభిస్తాం’’ అన్నారు.

దర్శకుడు చందూ మొండేటి మాట్లాడుతూ ‘‘నాగచైతన్య, సాయిపల్లవి, మిగతా సాంకేతిక నిపుణులు.. అందరూ బెస్ట్‌ ఇవ్వడానికి సిద్ధమైపోయారు. వాళ్లు నన్నెంతో ప్రోత్సహిస్తున్నారు’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో చైతన్య మత్స్యకారుడిగా కనిపిస్తారు. ఆ పాత్రలో ఆయన ఎలా కుదురుకుంటారో అనే ఆలోచన ఉండేది. కానీ, ‘తండేల్‌’ ఫస్ట్‌లుక్‌ చూసి ప్రేక్షకులతో పాటు నేను షాక్‌ అయ్యా. ఒక నటుడు ఓ పాత్రను బలంగా నమ్మి చేస్తే ఎలా ఉంటుందో అర్థమైపోయింది’’ అన్నారు నిర్మాత బన్నీ వాస్‌.

Also Read : Kiara Advani: సినిమా డైలాగ్ తో కియారాను పడేసిన సిద్ధార్ధ్ మల్హోత్ర

Akkineni Naga ChitanyaSai Pallavi
Comments (0)
Add Comment