Naga Chaitanya: నాగచైతన్య ‘తండేల్‌’ షూటింగ్ షురూ

నాగచైతన్య ‘తండేల్‌’ షూటింగ్ షురూ

Naga Chaitanya: ‘ప్రేమమ్‌’, ‘సవ్యసాచి’ చిత్రాల తర్వాత నాగచైతన్య- చందూ మొండేటి కాంబినేషన్‌లో రూపొందునున్న తాజా సినిమా ‘తండేల్‌’. గీతా ఆర్ట్స్‌ పతాకంపై బన్నీ వాస్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో నాగచైతన్య సరసన సాయిపల్లవి నటిస్తున్నారు. ఉత్తరాంధ్రా జిల్లాలకు చెందిన మత్సకారులు చేపల వేటకు వెళ్లి… పాకిస్తాన్ జైల్ లో బందీలుగా మారిన యథార్ధ కథ ఆధారంగా, విభిన్నమైన ప్రేమకథతో రూపొందిస్తున్న ఈ సినిమా షూటింగ్ ను కొద్ది రోజుల క్రితమే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. దీనితో ‘తండేల్‌’ సినిమా రెగ్యులర్‌ షూటింగ్ ను కర్ణాటకలోని ఉడిపి మల్పే పోర్ట్‌లో ఫైట్ సీక్వెన్స్ తో ప్రారంభించినట్టు చిత్ర యూనిట్ తెలిపింది.

Naga Chaitanya Movie Updates

ప్రేమమ్, మజిలి, లవ్ స్టోరీ తరువాత ఆ స్థాయిలో నాగచైతన్య(Naga Chaitanya) కష్టపడి, రీసెర్చ్ చేసి మరీ నటిస్తున్న సినిమా ‘తండేల్‌’. ఈ నేపధ్యంలోనే చిత్ర యూనిట్ తో సహా నాగ చైతన్య ఇటీవల శ్రీకాకుళం జిల్లాలోని కే.మత్సలేశం అనే మత్సకార గ్రామం వెళ్ళి వారి జీవన స్థితి గతులను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఓ సాంప్రదాయ మత్సకారునిగా తన లుక్ ని సైతం మార్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా తనకు చాలా ప్రత్యేకం అంటూ హీరో నాగచైతన్య పలుమార్లు వెల్లడించారు. అత్యున్నత సాంకేతిక హంగులతో రూపొందుతోన్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తుండగా సినిమాటోగ్రాఫర్ గా షామ్‌దత్‌ పనిచేస్తున్నారు.

Also Read : Taapsee Pannu: మరోసారి భయపెట్టేందుకు సిద్ధమైన తాప్సీ

Naga Chaitanya
Comments (0)
Add Comment