Naga Chaitanya: మరోసారి థ్రిల్లర్‌ కథతో వస్తున్న నాగచైతన్య !

మరోసారి థ్రిల్లర్‌ కథతో వస్తున్న నాగచైతన్య !

Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య థ్రిల్లర్‌ కథలతో ఎంతగా ప్రభావం చూపిస్తారో ఇటీవల విడుదలైన ‘దూత’ వెబ్ సిరీస్‌ చాటి చెప్పింది. ప్రముఖ దర్శకుడు విక్రమ్ కుమార్ కే దర్శకత్వంలో వచ్చిన ఈ సూప‌ర్ నేచుర‌ల్ క్రైమ్ థ్రిల్ల‌ర్ కు నాగ చైతన్యకు మంచి మార్కులు పడ్డాయి. అతీంద్రియ శక్తుల నేపధ్యంలో రూపొందిన ఈ వెబ్ సిరీస్ లో నాగచైతన్య యాక్టింగ్, విక్రమ్ కే కుమార్ టేకింగ్, ఉత్కంఠభరితమైన కథనం, ఇషాన్ చాబ్రా నేపథ్య సంగీతం, మికోలజ్ సైగులా సినిమాటోగ్రఫీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దీనితో స్ట్రీమింగ్ అయిన రెండో రోజునే ఈ వెబ్ సిరీస్ ప్రైమ్ టాప్ 10 లిస్టులో చేరి… కొన్ని గంటల్లోనే నెంబర్ 1 ప్లేస్ ను కైవసం చేసుకుంది.

Naga Chaitanya Movie Updates

దీనితో థ్రిల్లర్ కథలపై నాగ చైతన్య ఆశక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మరో సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ ‘విరూపాక్ష’ సినిమాతో విజయాన్ని అందుకున్న యువ దర్శకుడు కార్తీక్‌ దండు దర్శకత్వంలో నటించడానికి చైతూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనితో కార్తీక్ దండు… నాగ చైతన్య(Naga Chaitanya) కోసం స్క్రిప్ట్ ను సిద్ధం చేసారని ఫిల్మ్ నగర్ టాక్. చైతూకు కథ నచ్చడంతో ఈ ప్రాజెక్టు పనులు చకచకా జరుగుతున్నట్లు సమాచారం. ఈ సినిమాని కూడా ‘విరూపాక్ష’ తరహాలోనే ఓ విభిన్నమైన థ్రిల్లర్‌ కథతో తెరకెక్కించనున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ సినిమాపై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. అన్నీ కుదిరితే అలా వెండితెరపై పక్కా థ్రిల్లర్‌ కథతో చైతు సందడి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం నాగచైతన్య… చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందునున్న ‘తండేల్‌’ సినిమాలో నటిస్తున్నారు. గీతా ఆర్ట్స్‌ పతాకంపై బన్నీ వాస్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో నాగచైతన్య సరసన సాయిపల్లవి నటిస్తున్నారు. ఉత్తరాంధ్రా జిల్లాలకు చెందిన మత్సకారులు చేపల వేటకు వెళ్లి… పాకిస్తాన్ జైల్ లో బందీలుగా మారిన యథార్ధ కథ ఆధారంగా, విభిన్నమైన ప్రేమకథతో రూపొందిస్తున్న ‘తండేల్‌’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అది పూర్తయిన వెంటనే ఈ కొత్త సినిమా కోసం రంగంలోకి దిగనున్నారు.

Also Read : Anupama Parameswaran: హర్టయిన అనుపమ ! ‘టిల్లు స్కేర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు డుమ్మా ?

Karthik DanduNaga ChaitanyaVirupaksha
Comments (0)
Add Comment