Naga Chaitanya : తన కాబోయే భార్యతో మిర్రర్ సెల్ఫీ లో నాగ చైతన్య

ఇక చై-శోభిత చాలాకాలంగా నుంచి స్నేహితులుగా ఉన్నారు...

Naga Chaitanya : విదేశాల్లో ఓ రెస్టారెంట్‌లో వెయిటర్‌కు నాగచైతన్య ఇచ్చిన ఫొటోలో శోభితా ధూళిపాళ్ల కనిపించడంతో వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారన్న విషయం బయటపడింది. దానిపై ఎక్కడా ఇద్దరూ స్పందించలేదు. ఆ ఫొటో బయటకు వచ్చిన మూడు నెలల్లో ఇద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు. త్వరలో పెళ్లి పీటలెక్కనున్న విషయం తెలిసిందే. ఇటీవల వీరి నిశ్చితార్థం వేడుక ఇరు కుటుంబాల సమక్షంలో వైభవంగా జరిగింది. చైతన్య(Naga Chaitanya) తనకు కాబోయే సతీమణితో దిగిన మిర్రర్‌ సెల్ఫీ ఫొటోను తాజాగా నెటిజన్లతో పంచుకున్నారు. ఇందులో వీరిద్దరూ ట్రెండీ లుక్స్‌లో కనిపించారు. ‘‘ఎవ్రిథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌’’ అని నాగచైతన్య ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. కానీ ఈ ఫొటోకు ఆయన కామెంట్స్‌ సెక్షన్‌ మాత్రం ఆఫ్‌ చేశారు. కామెంట్‌ బాక్స్‌లో నెటజన్లు ఎలాంటి కామెంట్లు పెడతారో, ఈ అన్‌లైన్‌ పంచాయతీ మనకెందుకులే అని చైతన్య ఇలా చేశారని నెటజన్లు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది.

Naga Chaitanya…

ఇక చై-శోభిత చాలాకాలంగా నుంచి స్నేహితులుగా ఉన్నారు. ఆగస్టు 8న వీరి నిశ్చితార్థం జరిగింది. సన్నిహితుల సమక్షంలో ఎంగేజ్‌మెంట్‌ చేసుకోవడంపై ఇటీవల శోభిత మాట్లాడారు. ‘‘ నిశ్చితార్థ వేడుక గ్రాండ్‌గా జరగాలని నేను ఎప్పుడూ ప్లాన్‌ చేసుకోలేదు. జీవితంలో ముఖ్యమైన ఆ క్షణాలను ఆస్వాదించాలని అనుకున్నా. తెలుగు సంప్రదాయాలకు అనుగుణంగా ఇలాంటి వేడుకలు జరగాలని ఎప్పుడూ అనుకునేదాన్ని. సంస్కృతి, సంప్రదాయాలకు నా తల్లిదండ్రులు ఎంతగానో విలువ ఇస్తారు. వాటికి నేను బాగా కనెక్ట్‌ అవుతాను. నేను అనుకున్న విధంగానే సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక ప్రశాంతంగా జరిగింది. అందమైన క్షణాలతో నా మనసు నిండింది. ఆ వేడుక సింపుల్‌గా జరిగిందని నేను అనుకోవడం లేదు’’ అని అన్నారు. నాగచైతన్య ప్రస్తుతం తండేల్‌ సినిమాలో నటిస్తున్నారు. గత ఏడాది పొన్నియన్‌ సెల్వన్‌తో మెప్పించిన శోభిత ఏడాది ఇంగ్లిష్‌ చిత్రం మంకీ మెన్‌’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. హిందీలో లవ్‌- సితార చిత్రంలో నటిస్తోంది.

Also Read : Devara Movie : కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న దేవర బ్యూటీ

Naga ChaitanyaSobhita DhulipalaTrendingUpdatesViral
Comments (0)
Add Comment