Naga Chaitanya : తన కాబోయే భార్యపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నాగచైతన్య

నాగ చైతన్య– శోభితా ధూళిపాళ్ల వివాహం డిసెంబర్‌ 4న హైదరాబాద్‌లో జరగనుంది...

Naga Chaitanya : పెళ్లిపనులు చాలా వేగంగా జరుగుతున్నాయని, గెస్ట్‌ లిస్ట్‌, పెళ్లికి సంబంధించిన ఇతర విషయాలను ఇద్దరం కలిసి నిర్ణయిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌ తమ కుటుంబానికి ఎంతో ప్రత్యేకమని, స్టూడియోలోని తాతగారి విగ్రహం ఎదురుగా తమ పెళ్లి జరగనుందని వెల్లడించారు. తాతగారి ఆశీస్సులు తమపై ఎప్పుడూ ఉండాలనే ఉద్దేశంతో ఇరు కుటుంబాలు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలిపారు. శోభిత తనను చాలా బాగా అర్థం చేసుకుందన్న చైతన్య.. ఆమెకు తానెంతగానో కనెక్ట్‌ అయ్యానని తెలిపారు. తన జీవితంలో ఏర్పడిన శూన్యాన్ని శోభిత పూడుస్తుందని నమ్ముతున్నానన్నారు.

Naga Chaitanya Comments..

నాగ చైతన్య– శోభితా ధూళిపాళ్ల వివాహం డిసెంబర్‌ 4న హైదరాబాద్‌లో జరగనుంది. ఇరు కుటుంబాల పెద్దలు, ఆత్మీయుల సమక్షంలో ఈ వేడుక జరగనుందని టాక్‌. ఈ పెళ్లి గురించి ఇటీవల నాగార్జున స్పందించారు. కుటుంబసభ్యులు, సన్నిహితులు, సినీ ప్రముఖులు మొత్తం 300 మందిని పిలవాలని అనుకుంటున్నట్టు తెలిపారు. రిసెప్షన్‌ వివరాలను త్వరలో తెలుపుతామని అన్నారు. నాగచైతన్య ప్రస్తుతం ‘తండేల్‌’ కోసం వర్క్‌ చేస్తున్నారు. దీనికి చందు మొండేటి దర్శకుడు. సాయిపల్లవి కథానాయిక. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది.

Also Read : Abhishek Bachchan : తన భార్య ఐశ్వర్య రాయ్ కి అభినందనలు తెలిపిన అభిషేక్

Akkineni Naga ChaitanyaCommentsmarriageSobhita DhulipalaViral
Comments (0)
Add Comment