Naga Chaitanya: శ్రీకాకుళంలో నాగచైతన్య ‘తండేల్‌’ షూటింగ్ !

శ్రీకాకుళంలో నాగచైతన్య ‘తండేల్‌’ షూటింగ్ !

Naga Chaitanya: ‘ప్రేమమ్‌’, ‘సవ్యసాచి’ చిత్రాల తర్వాత నాగచైతన్య- చందూ మొండేటి కాంబినేషన్‌లో రూపొందునున్న తాజా సినిమా ‘తండేల్‌’. గీతా ఆర్ట్స్‌ పతాకంపై బన్నీ వాస్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో నాగచైతన్య సరసన సాయిపల్లవి నటిస్తున్నారు. ఉత్తరాంధ్రా జిల్లాలకు చెందిన మత్సకారులు చేపల వేటకు వెళ్లి… పాకిస్తాన్ జైల్ లో బందీలుగా మారిన యథార్ధ కథ ఆధారంగా, విభిన్నమైన ప్రేమకథతో రూపొందిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల ‘తండేల్‌’ సినిమాకు సంబంధించి విడుదల చేసిన టైటిల్ లుక్, టీజర్ కు అభిమానుల నుండి విశేషమైన స్పందన వచ్చింది. దీనితో ‘తండేల్‌’ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి.

Naga Chaitanya Movie Updates

2018లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సెమీ పీరియాడికల్‌ ఫిల్మ్‌లో జాలరి రాజు పాత్రలో నాగచైతన్య(Naga Chaitanya), సత్య పాత్రలో సాయి పల్లవి కనిపించబోతున్నారు. శరవేగంగా జరుగుతున్న తండేల్ సినిమా షూటింగ్… దాదాపు చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి చిత్ర యూనిట్ శ్రీకాకుళం చేరుకుంది. ఈ షెడ్యూల్ లో హీరో నాగచైతన్య, హీరోయిన్ సాయిపల్లవి మధ్య ఎమోషనల్ సీన్స్ ను దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. దీనితో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం మత్సలేశం అనే మత్సకార గ్రామంలో తండేల్ సందడి నెలకొంది. చుట్టు ప్రక్కల గ్రామాల నుండి పెద్ద ఎత్తున అభిమానులు షూటింగ్ ను చూడటానికి తరలివస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబరులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.

Also Read : Kiara Advani: డాన్ 3 కు సిద్ధమౌతున్న కియారా అద్వానీ !

Naga ChaitanyaSai PallaviThandel
Comments (0)
Add Comment