Naga Chaitanya : తన పర్సనల్ లైఫ్ కోసం వ్యాఖ్యానించిన నాగచైతన్య

ఇక ఈ ఎపిసోడ్ లో చైతన్య 'తండేల్' హీరోయిన్ సాయి పల్లవి గురించి తీసుకొచ్చిన ప్రస్తావన హైలెట్ గా నిలిచింది...

Naga Chaitanya : అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్టార్ అయిన న్యూ ఏజ్ టాక్ షో ‘ది రానా దగ్గుబాటి షో’. మోస్ట్ విట్టి అండ్ సెన్సిబిల్ హోస్ట్ రానా దగ్గుబాటి దీనిని సక్సెస్ ఫుల్ గా నిర్వహిస్తున్నారు. మొదటి ఎపిసోడ్ లో నేచురల్ స్టార్ నాని, తేజ సజ్జలతో సూపర్ హిట్ కాగా రెండవ ఎపిసోడ్ లో స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ, శ్రీలీల మంచి కిక్ ఎక్కించారు. తాజాగా జరిగిన థర్డ్ ఎపిసోడ్ లో రానా తన కుటుంబ సభ్యులతో హంగామా చేశారు. చైతు, మిహీక, సుమంత్ తదితరులతో ఎపిసోడ్ అదిరిపోయింది అంటున్నారు అభిమానులు.

Naga Chaitanya Comment

ఇక ఈ ఎపిసోడ్ లో చైతన్య(Naga Chaitanya) ‘తండేల్’ హీరోయిన్ సాయి పల్లవి గురించి తీసుకొచ్చిన ప్రస్తావన హైలెట్ గా నిలిచింది. ఇక రానా దగ్గుబాటి ర్యాగింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాయి పల్లవి ఇప్పటికే రానాతో విరాటపర్వం, చైతూతో లవ్ స్టోరీలో నటించగా ప్రస్తుతం ‘తండేల్’లో నటిస్తుంది. ఈ నేపథ్యంలోనే వీరిద్దరూ సాయి పల్లవికి కాల్ చేశారు. బేసిక్ గా సాయి పల్లవి తాను యాక్ట్ చేసే సినిమాల్లో సీన్, పాట షూట్ తర్వాత మానిటర్ దగ్గరికి పరుగెత్తికెళ్లి చెక్ చేసుకుంటుందని టాక్. అలాగే బాగా అనిపించకపోతే రీ షూట్ చేయిస్తుందట. ఇదే విషయాన్ని రానా కాల్ లో గట్టిగా అడగగా.. సాయి పల్లవి నవ్వుతు, అలాంటిది ఏం లేదని, వాళ్లే తనను పిలుస్తారు కాబట్టి చూస్తాను తప్పించి నేనేం ఎడిటింగ్ లో తలదూర్చనని చెప్పింది.

అప్పుడే చైతన్య(Naga Chaitanya) కలగజేసుకుంటూ.. తన పని కూడా ఆమె చేస్తూ టేక్ అయ్యాక మానిటర్ దగ్గరకు టింగు టింగు మంటూ పరిగెత్తుకొస్తూ ఉంటే తనకు ఆందోళన చెందాల్సిన అవసరం ఏముందని, అంతా సాయిపల్లవినే చూసుకుంటుందని అన్నారు. ఇక సాయి పల్లవి మాట్లాడుతూ ఇండస్ట్రీలో చైతూ నాకు చాలా చిరాకు, కోపం తెప్పించే హీరో అంది. ఎందుకంటే ఎలాంటి టెన్షన్ లేకుండా కూల్ గా ఉండటం ఆమెకు కోపం తెప్పిస్తుందట. ఇలా క్యాండీడ్ కన్వర్సేషన్స్‌తో రానా షో సూపర్ అనిపించుకుంటుంది.

Also Read : Naveen Polishetty : రణబీర్ కపూర్, సాయిపల్లవి ‘రామాయణం’ సినిమాలో నవీన్ పోలిశెట్టి

Akkineni Naga ChaitanyaCommentsTrendingUpdatesViral
Comments (0)
Add Comment