Naga Chaitanya: అక్కినేని కుటుంబంలో పెళ్ళి బాజాలు మోగాయి. అక్కినేని నాగార్జున వారసుడు హీరో నాగచైతన్యకు శోభిత ధూళిపాళ్ళల నిశ్చితార్థం గురువారం వైభవంగా జరిగింది. హైదరాబాద్ లో కుటుంబ సభ్యులు, సన్నిహితులు సమక్షంలో సింపుల్ గా జరిగింది. అయితే ఇది జరిగిన కొన్ని గంటల్లోనే నాగచైతన్య… ఓ పెళ్లి మండపంలో ప్రత్యక్షమ్యారు. రాజమహేంద్రవరం వేదికగా జరిగిన తన అసిస్టెంట్ వెంకటేశ్ పెళ్లిలో కనిపించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
‘తండేల్’ సినిమాతో బిజీగా ఉన్న నాగచైతన్య(Naga Chaitanya)… గురువారం శోభితతో ఎంగేజ్‌మెంట్ చేసుకుని అందరినీ సర్‌ప్రైజ్ చేశాడు. గత కొన్నాళ్లుగా రూమర్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు అధికారికంగా ప్రకటించేశారు. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే రాజమండ్రి వెళ్లిన చైతూ… శుక్రవారం తన అసిస్టెంట్ వెంకటేశ్ పెళ్లికి హాజరయ్యాడు. నూతన వధూవరుల్ని దీవించాడు.
Naga Chaitanya – నిశ్చితార్థం తర్వాత శోభిత ఫస్ట్ పోస్ట్ !
నాగ చైతన్యతో నిశ్చితార్థం అనంతరం నటి శోభిత సోషల్ మీడియాలో శుక్రవారం తొలి పోస్ట్ పెట్టారు. ఎంగేజ్‌మెంట్ వేడుక ఫొటోలు పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. ‘‘మన పరిచయం ఎలా మొదలైనా? ప్రేమలో మన హృదయాలు కలిసిపోయాయి’’ అని నాగ చైతన్యను ఉద్దేశించి క్యాప్షన్ పెట్టారు. చై-శోభిత నిశ్చితార్థం గురువారం వైభవంగా జరిగింది. ఉదయం 9:42 గంటలకు వేడుక జరినట్టు అభిమానులకు తెలియజేస్తూ నాగార్జున సోషల్ మీడియా వేదికగా ఫొటోలు షేర్ చేశారు. క్షణాల్లోనే అవి వైరల్‌గా మారాయి. కాబోయే దంపతులు ఏం పోస్ట్ చేస్తారోనని ఇరువురి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూశారు. శోభిత పోస్ట్ నే నాగ చైతన్య రీ పోస్ట్ చేశారు. పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Also Read : Thalapathy Vijay: అభిమానులకు కండీషన్ పెట్టిన హీరో విజయ్ !