Nag Ashwin : మహానటి మూవీతో దేశ వ్యాప్తంగా తన వైపు చూసేలా చేసిన దర్శకుడు నాగ్ అశ్విన్. తను అంతర్ముఖుడు. ఎక్కువగా మాట్లాడడు. అంతే కాదు తాను చెప్పాలని అనుకున్నది తెర మీద వచ్చేంత వరకు ఊరుకోడు. ఒక రకంగా చెప్పాలంటే పని రాక్షసుడు. ఎలాంటి భేషజాలు లేకుండా సింపుల్ గా ఉండటం తనకు ఇష్టం. అలాగేనే ఉంటాడు. మిగతా వారు ఏం చేస్తున్నారనేది పట్టించుకోడు. కానీ టాలీవుడ్ కు సంబందించి సినిమా 24 ఫ్రేమ్స్ లో ప్రతిభ కలిగిన వారిని ఎంకరేజ్ చేయడంలో నాగ్ అశ్విన్ ముందుంటాడు. తానే వారు వద్దన్నా సపోర్ట్ చేస్తాడు. ఇది తన ప్రత్యేకత. అందుకే తనంటే చాలా మంది ఇష్ట పడతారు.
Nag Ashwin Sensational Updates on Kalki 2
సున్నిత మనస్కుడైన నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చిన్న పాత్ర దక్కితే చాలు అనుకునే నటీ నటులు చాలా మంది ఉన్నారు. మహానటి తర్వాత తను డార్లింగ్ ప్రభాస్ తో మైథలాజికల్ మూవీ తెరకెక్కించాడు. అదే కల్కి-1. దీనిని అశ్వనీదత్ నిర్మించాడు. ఎవరూ ఊహించని రీతిలో బిగ్ సక్సెస్ గా నిలిచింది. నిర్మాతకు కాసుల వర్షం కురిపించేలా చేసింది. ఏకంగా రూ. 1000 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇందులో డార్లింగ్ ప్రభాస్ , బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే, బిగ్ బి అమితాబ్ బచ్చన్..ఇలా భారీ తారగణంతో కల్కికి ప్రాణం పోశాడు.
దీంతో ఒక్కసారిగా అందరి దృష్టి నాగ్ అశ్విన్ పై పడింది. తాజాగా చిట్ చాట్ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశాడు. కల్కి 2(Kalki 2) సీక్వెల్ గురించి అప్ డేట్ ఇచ్చాడు. షూటింగ్ పార్ట్ 2 ఈ ఏడాది చివరలో ఉంటుందన్నాడు. కథ ఎలా ఉంటుందనేది ఇప్పుడే చెప్పలేమన్నాడు. కానీ ప్రేక్షకులు మాత్రం ఉద్విగ్నతకు లోనవుతారని స్పష్టం చేశాడు. దీంతో అంచనాలు మరింత పెరిగాయి ఈ మూవీపై.
Also Read : PM Modi- Popular Musician illayaraja :సంగీత శిఖరం దేశానికి గర్వకారణం