Nag Ashwin: చిన్నారులకు గోల్డెన్ ఛాన్స్‌ ప్రకటించిన కల్కి డైరెక్టర్‌ నాగ్ అశ్విన్ !

చిన్నారులకు గోల్డెన్ ఛాన్స్‌ ప్రకటించిన కల్కి డైరెక్టర్‌ నాగ్ అశ్విన్ !

Nag Ashwin: ప్రభాస్‌ ప్రధాన పాత్రలో నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కించిన తాజా సినిమా ‘కల్కి 2898 ఏడీ’. వైజయంతి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత అశ్విన్ దత్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ లార్జ్ దెన్ లైఫ్, మైథాలజీ ఇన్స్పైర్డ్ ఫ్యుచరిస్ట్ సైన్స్ ఫిక్షన్ గ్లోబల్ ఫిల్మ్ లో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటాని ఇతర కీలక పాత్రల్లో నటించారు. జూన్‌ 27న విడుదలైన ఈ సినిమా… బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించుకుని వెయ్యి కోట్లకు పైగా వసూళ్ళు సాధించింది. ఈ సినిమాలో భైరవ పాత్రలో హీరో ప్రభాస్ ఉపయోగించిన బుజ్జి (వాహనం) ప్రత్యేకంగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలనే ఈ ‘బుజ్జి’ వాహనాన్ని థియేటర్ల వద్ద పెట్టి అభిమానులకు అదనపు వినోదాన్ని పంచింది చిత్ర యూనిట్.

Nag Ashwin Comment

తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో అవకాశాన్ని అభిమానులకు కల్పిస్తున్నట్లు దర్శకుడు నాగ్ అశ్విన్(Nag Ashwin) ప్రకటించారు. అయితే ఈ అవకాశం మాత్రం చిన్నారులకు మాత్రమే. చిన్నారులకు కల్కి మూవీ సెట్‌ చూసే అవకాశం కల్పించనున్నట్లు నాగ్ అశ్విన్ ప్రకటించారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఇన్‌ స్టా ద్వారా పంచుకున్నారు. అయితే చిన్నారికి సంబంధించి కల్కి సినిమాపై ఓ వీడియోను పంపించాలని ఆయన కోరారు. వీటిలో ఎంపికైన వారికి కల్కి సెట్ చూసే అవకాశం కల్పిస్తామని తెలిపారు. దీనితో కల్కి సెట్ చూసే అవకాశాన్ని దక్కించుకునేందుకు చిన్నారులు వీడియోలు పంపే పనిలో నిగమ్నమయ్యారు. అయితే ఎంతమంది వీడియోలు పంపించారు, అందులో ఎంతమందిని ఎంపిక చేస్తారు, వారిలో ఎంతమంది ప్రత్యక్షంగా కల్కి సెట్ ను చూస్తారు అని తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే.

Also Read : Bunny Vas: మెగా, అల్లు ఫ్యామిలీలపై బన్నీ వాస్ ఆశక్తికర వ్యాఖ్యలు !

Kalki 2898 ADNag AshwinPrabhas
Comments (0)
Add Comment