Nag Ashwin: గొప్ప మనసు చాటుకున్న ‘కల్కి’ డైరెక్టర్ ! స్కూల్ బిల్డింగ్ కు రూ.66 లక్షలు విరాళం !

గొప్ప మనసు చాటుకున్న 'కల్కి' డైరెక్టర్ ! స్కూల్ బిల్డింగ్ కు రూ.66 లక్షలు విరాళం !

Nag Ashwin: ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాతో దర్శకుడిగా పరిచయమై… ‘మహానటి’ మూవీతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న యువ దర్శకుడు నాగ్ అశ‍్విన్. ‘మహానటి’తో దక్షిణాది భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నాగ్ అశ్విన్… తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ‘కల్కి’ సినిమా తెరకెక్కించి ప్రపంచ స్థాయి దర్శకుడిగా మారారు. వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వనీదత్ నిర్మాతగా నిర్మించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1100 కోట్ల రూపాయలకు పైగా వసూళ్ళు సాధించింది.

Nag Ashwin Helps..

అయితే ‘కల్కి’ సినిమాతో వరల్డ్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్(Nag Ashwin) తన గొప్ప మనసును చాటుకున్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలోని తన సొంతూరు ఐతోల్‌ లో తన తాత సింగిరెడ్డి పర్వత్ రెడ్డి పేరుతో ప్రభుత్వ పాఠశాలకు అదనపు గదులు నిర్మించి ఇచ్చాడు. తన తండ్రి చదువుకున్న ఈ స్కూల్‌కి తన వంతుగా ఈ సాయం చేసినట్లు పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే అదనపు గదులు నిర్మించేందుకు దాదాపు రూ. 66 లక్షల మేర ఖర్చయినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులోనూ మరింత సహాయం చేయడానికి తమ కుటుంబం ఎప్పుడు ముందుంటుందని నాగ్ అశ్విన్ చెప్పాడు. తాజాగా ఈ గదుల ప్రారంభోత్సవానికి తల్లిదండ్రులతో కలిసి నాగ్ అశ్విన్ హాజరయ్యాడు. దీనితో నాగ్ అశ్విన్ సామాజిక బాధ్యతపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Also Read : Bhagyashri Borse: ‘నల్లంచు తెల్లచీర’ మాస్‌ సాంగ్‌ కు స్టేజిపై స్టెప్పులేసిన భాగ్యశ్రీ బోర్సే !

Kalki 2898 ADMahanatiNag Ashwin
Comments (0)
Add Comment