Nadigar Sangam: దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) 68వ సర్వసభ్య సమావేశం వచ్చే నెల 8వ తేదీ జరుగనుంది. తేనాంపేటలోని కామరాజర్ అరంగంలో జరిగే ఈ సమావేశంలో సంఘం అధ్యక్షుడు నాజర్, ప్రధాన కార్యదర్శి విశాల్, కోశాధికారి కార్తీ, ఉపాధ్యక్షులు పూచ్చి మురుగన్, కరుణాస్ సహా ఆ సంఘం ఇతర కార్యవర్గ సభ్యులు, సాధరణ సభ్యులంతా పాల్గొననున్నారు. ఇందులో పలువురు తమిళ హీరోలకు, తమిళ సినీ నిర్మాతల సంఘానికి మధ్య నెలకొన్న వివాదం, ఇటీవల నిర్మాతల మండలి తీసుకున్న పలు వివాదాస్పద, సంచలన నిర్ణయాలపై చర్చించనున్నారు. ముఖ్యం గా నిర్మాతల సంఘంతో ఉన్న సమస్యలన్నింటినీ చర్చించి పరిష్కరించుకునేలా నడిగర్ సంఘం ఆసక్తి చూపుతోంది.
Nadigar Sangam Meeting
ఇందుకోసం సెప్టెంబరు 8వ తేదీన సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించాలని సంఘ కార్యవర్గం నిర్ణయించింది. అలాగే, సర్వసభ్య సమావేశంలో స్టార్‌నైట్ నిర్వహించి నిధుల సేకరణ, నడిగర్ సంఘం(Nadigar Sangam) భవన నిర్మాణం, భవిష్యత్ ప్రణాళిక తదితర అంశాలపై చర్చించనున్నారు.
అడ్వాన్స్ లు తీసుకొని పూర్తి చేయని నటీనటులపై యాక్షన్ తీసుకోవడానికి కొద్ది రోజుల క్రితం తమిళ చలన చిత్ర నిర్మాతల మండలి సంచలన నిర్ణయం తీసుకుంది. అగ్రనటుల సినిమాలు విడుదలైన 8 వారాలు తర్వాతే వాటిని ఓటీటీలో విడుదల చేయాలని, నటీనటులు, సాంకేతిక కళాకారులు అడ్వాన్స్ తీసుకున్న నిర్మాత చిత్రాన్ని ముందుగా పూర్తిచేసిన తర్వాతే ఇతర చిత్రాల్లో నటించాలని సూచించారు. సెట్స్ మీదకు వెళ్లి పెండింగ్‌లో ఉన్న సినిమాలు పూర్తి చేసిన తరువాతే కొత్త సినిమాల షూటింగ్స్ మొదలుపెట్టాలనే రూల్ తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో నటుడు ధనుష్ తీరుపై నిర్మాతల మండలి ఆగ్రహం వ్యక్తం చేస్తోందని తెలిసింది.
అడ్వాన్స్ తీసుకొని షూటింగ్స్ పూర్తి చేయడం లేదని ఇప్పటికే ధనుష్‌పై ఫిర్యాదులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నటుడు ధనుష్ ఇకపై ఆయనతో సినిమాలు చేసే నిర్మాతలు ఆ ప్రాజెక్టు పనులు ప్రారంభించడానికి ముందు రాష్ట్ర సినీ నిర్మాతల సంఘంతో చర్చించాలని తీర్మానించారు.అంతేకాదు ఇకపై ధనుష్ సినిమా అంగీకరించాలంటే నిర్మాతల మండలి అనుమతి ఉండాల్సిందేనని తేల్చిచెప్పినట్లు సమాచారం. దీనితో తాజాగా నడిగర్ సంఘం(Nadigar Sangam)… హీరో ధనుష్ కు మద్దత్తు తెలిపింది.
Also Read : Mukesh Rishi: కన్నప్ప సినిమా నుండి ముఖేష్ రిషి ‘కంపడు’ ఫస్ట్ లుక్ రిలీజ్ !