Nabha Natesh: నిఖిల్‌ ‘స్వయంభూ’ నుండి నభా నటేష్ లుక్‌ రిలీజ్ !

నిఖిల్‌ ‘స్వయంభూ’ నుండి నభా నటేష్ లుక్‌ రిలీజ్ !

Nabha Natesh: ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో టాలీవుడ్‌ కు పరిచయమయిన కన్నడ నటి నభానటేష్‌(Nabha Natesh)… రామ్‌ పోతినేని హీరోగా నటించిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ‘సోలో బ్రతుకే సో బెటర్‌’, ‘డిస్కో రాజా’, వంటి చిత్రాల్లో నటించిన ఆమె దాదాపు మూడేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇటీవల టాలీవుడ్‌ యంగ్‌ హీరో నిఖిల్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘స్వయంభూ’ సినిమాలోని ఓ ముఖ్య పాత్రకు నభా నటేష్‌ పేరుని ఖరారు చేశారని వార్తలొచ్చాయి. ఆ వార్తలు నిజమేనంటూ తాజాగా సినిమాలో ఆమె లుక్‌ కి సంబంధించిన వీడియోను విడుదల చేసిన చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం నభా నటేష్ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

Nabha Natesh Movie Updates

కార్తికేయ-2 వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత నిఖిల్ నటిస్తున్న తాజా సినిమా ‘స్వయంభూ’. దర్శకుడు భరత్‌ కృష్ణమాచారి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నికిల్ సరసన సంయుక్త మేనన్‌ నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో రెండో హీరోయిన్ గా నభా నటేష్ ను చిత్ర యూనిట్ ఎంపిక చేసింది. యుద్ధ నేపథ్య కథాంశంతో రూపొందుతోన్న ఈ యాక్షన్‌ డ్రామాలో నిఖిల్‌ ఓ యోధుడి పాత్రలో కనువిందు చేయనున్నారు. ఇందుకోసం ఆయన మార్షల్‌ ఆర్ట్స్‌, గుర్రపు స్వారీ తదితర విద్యల్లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఠాగూర్‌ మధు సమర్పణలో భువన్‌, శ్రీకర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రవి బస్రూర్‌ సంగీతమందిస్తుండగా.. మనోజ్‌ పరమహంస ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.

Also Read : Boney Kapoor: శ్రీదేవి బయోపిక్‌ కు నో అంటున్న బోనీ కపూర్ !

Nabha NateshNikhil SiddharthSwayambhu
Comments (0)
Add Comment