Naa Saami Ranga: టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున, యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ ఆశికా రంగనాథ్ హీరోహీరోయిన్లుగా దర్శకుడు విజయ్ బిన్నీ తెరకెక్కించిన తాజా సినిమా “నా సామిరంగ(Naa Saami Ranga)”. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్, మిర్నా , రుక్షర్ ధిలాన్ తదితరులు నటించగా ఎం ఎం కీరవాణి సంగీతం అందించారు. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా నాగ్ కెరీర్ లో మరో సంక్రాంతి హిట్ గా నిలిచింది. అయితే సంక్రాంతికి రిలీజైన దాదాపు అన్ని సినిమాలు కూడా ఓటీటీలో స్ట్రీమింగ్ కో వచ్చేయడంతో… నాగార్జున “నా సామిరంగ” కోసం అభిమానులు ఆశక్తికరంగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో… ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ గుడ్ న్యూస్ చెప్పింది.
Naa Saami Ranga OTT Updates
మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చి సంక్రాంతి బరిలో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్న ‘నా సామిరంగ(Naa Saami Ranga)’ సినిమాను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఫిబ్రవరి 16 అర్ధరాత్రి నుంచే అందుబాటులోకి తీసుకు వచ్చేసింది. అయితే ఇందులో ఎలాంటి సీన్స్ ను యాడ్ చేయలేదు. థియేటర్లలో వచ్చిన వెర్షన్ నే నేరుగా స్ట్రీమింగ్ కు తీసుకు వచ్చారు. దీనితో నాగ్ అభిమానుల మరో వారం రోజుల పాటు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ అభిమానులుగా మారిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
Also Read : Rukmini Vasanth : ముద్దుగుమ్మకు స్టార్ హీరోలతో సినిమాలకు క్యూ కడుతున్న ఛాన్సులు