Naa Saami Ranga OTT : టాలీవుడ్ మన్మధుడు నాగార్జున ‘నా సామి రంగ’ ఓటీటీలో ఇప్పటి నుంచే…

'నా సామి రంగ' చిత్రంలో నాజర్, మలయాళ నటులు షబ్బీర్ కలరక్కల్, రవివర్మ, రావు రమేష్ మరియు మధు సూదన్ రావు ప్రధాన పాత్రలు పోషించారు.

Naa Saami Ranga : టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున నటించిన తాజా చిత్రం ‘నా సామి రంగ’. విజయ్ బిన్నీ దర్శకత్వం వహించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ ప్రధాన పాత్రలో నటించింది. అల్లరి నరేష్, రాజ్ తరుణ్, మిర్నా, రుక్సాన్ ధిల్లాన్ ముఖ్య పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలైన ‘నా సామి రంగ’ భారీ విజయాన్ని అందుకుంది. సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలైన ‘నా సామి రంగ’ భారీ విజయాన్ని అందుకుంది. నాగ్… మరోసారి ప్రేక్షకులను అలరించాడు. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల నుంచి మెప్పు పొందాడు. థియేటర్లలో భారీ విజయాన్ని అందుకున్న ‘నా సామి రంగ’ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది.

ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ‘నా సామి రంగ(Naa Sami Ranga)’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. OTT విడుదలకు సంబంధించి అధికారిక ప్రకటన విడుదల చేసింది. ‘నా సామి రంగ’ త్వరలో OTTలో విడుదల కానుందని హాట్‌స్టార్ వీడియో ప్రకటించింది. అయితే విడుదల తేదీని అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఈ సినిమా ఫిబ్రవరి 16న స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.

Naa Saami Ranga OTT Updates

‘నా సామి రంగ’ చిత్రంలో నాజర్, మలయాళ నటులు షబ్బీర్ కలరక్కల్, రవివర్మ, రావు రమేష్ మరియు మధు సూదన్ రావు ప్రధాన పాత్రలు పోషించారు. చాలా రోజుల తర్వాత నాగార్జున సినిమాకు కీరవాణి సంగీతం అందించారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస్ చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. మరి థియోటర్స్‌లో ఘనవిజయం సాధించిన ‘నా సామి రంగ’ చిత్రానికి ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

Also Read : Lokesh Kanakaraj Movie : లోకేష్ కనకరాజ్ శృతి హాసన్ తో మరో ప్రాజెక్ట్

Cinemaking nagarjunaNaa saami RangaOTTTrendingUpdates
Comments (0)
Add Comment