Naa Saami Ranga : రొమాంటిక్ హీరో అక్కినేని నాగార్జున లుక్ కెవ్వు కేక అనిపించేలా ఉంది. తాజాగా నా సామి రంగా లుక్ ఆకట్టుకునేలా ఉంది. నటుడిగా, ప్రయోక్తగా గుర్తింపు పొందారు అక్కినేని నాగార్జున. ఆయన నటించిన సినిమాలు ఈ మధ్యన సక్సెస్ కాలేదు.
Naa Saami Ranga Look Viral
ఆయన ఎంపిక చేసుకున్న కథలు, తీసుకుంటున్న నిర్ణయాలు కొంత మేరకు ఆశించిన మేర వర్కవుట్ కావడం లేదన్న విమర్శలు లేక పోలేదు. ఆయన తన కెరీర్ ను మార్చిన ఏకైక సినిమా శివ. ఇప్పటికీ అది ఎవర్ గ్రీన్ మూవీనే.
అంతే కాదు అక్కినేని నాగార్జునను రొమాంటిక్ హీరోగా నిలబెట్టింది నిన్నే పెళ్లాడుతా, మన్మధుడు. నాగ్ ఆగస్టు 29న పుట్టిన రోజు జరుపుకున్నారు. అక్కినేని నాగార్జునకు 63 ఏళ్లు. ఇదే సమయంలో తన ఫ్యాన్స్ కు తీపి కబురు చెప్పారు.
నా సామి రంగ(Naa Saami Ranga) చిత్రం చేస్తున్నట్లు నాగ్ ప్రకటించారు. ఫస్ట్ గ్లింప్స్ లో అక్కినేని మాస్ హీరోగా దర్శనం ఇచ్చారు. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నారు. ఇప్పటి దాకా రొమాంటిక్ , స్టైలిష్ లుక్స్ లో కనిపించిన అక్కినేని నాగార్జున ఇప్పుడు పక్కా మాస్ లుక్ తో కనిపించడం మరింత ఆనందాన్ని కలిగించేలా చేసింది.
Also Read : Jawan Movie : బాద్ షా క్రేజ్ జవాన్ జోష్